స్వాతంత్ర పోరాట సాధనలో కవుల పాత్ర, వారి రచనలు వెలకట్టలేనివి……. జిల్లా కలెక్టర్ కె.శశాంక*

స్వాతంత్ర పోరాట సాధనలో కవుల పాత్ర, వారి రచనలు వెలకట్టలేనివి……. జిల్లా కలెక్టర్ కె.శశాంక*

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -16:

ప్రజలను మమేకం చేస్తూ స్వాతంత్ర పోరాట సమయంలో ఉద్యమాల వైపు నడుపుట లో కవుల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు.

మంగళవారం ఐ.ఎం. ఏ. హాలులో నిర్వహించిన కవి సమ్మేళనంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ, కవి గాంచని చోట రవిగాంచడని, కవి లేనిదే ప్రపంచ చరిత్రకు ఆనవాళ్లు లేవని, అలాగే వరంగల్ ప్రాంతీయ వాసి కాలోజి నారాయణరావు చెప్పిన విధంగా ఒక్క సిరా చుక్క 1000 మెదళ్లను కదిపిస్తుందని, స్వాతంత్ర సంగ్రామంలో గొప్ప రచనలు చేసిన కవులు, కళాకారులు తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో వారు చేసిన రచనలు స్ఫూర్తి దాయకమని, అట్టి వాటిని గుర్తు చేసుకొని స్పూర్తి గా పొందాలని, రాబోతున్న సమాజానికి కొత్త ఆలోచనలు అందించే శక్తి ఉంటుందని, తొలి మలి దశ ఉద్యమాల్లో కవుల కళాకారుల పాత్ర గొప్పదని స్ఫూర్తిదాయక మన్నారు. ముందుచూపుతో పరిస్థితులను పసిగట్టి పెన్నుతో పదును పెట్టి ప్రేరణ చేసేవారు కవులని, రచనలను ఆలోచన విధానాలను మన ముందుంచే ప్రయత్నమే కవులు చేస్తున్నారని, ఉమ్మడి జిల్లా నుండి అనేక మంది గొప్ప రచనలు కవులు కళాకారులు ఉన్నారని, నిత్యం చదువుతూ విజ్ఞానం తో గొప్ప గొప్ప రచనలు ముందుకు తీసుకురావాలని, మన రచనలతో పిల్లలను యువకులను, చుట్టూ సమాజాన్ని మేల్కొలపాలని, అమ్మను సమాజాన్ని మరిచి పోయినట్లే అన్న సామెతలను గుర్తు చేసుకోవాలని పుస్తకాల వల్ల జ్ఞానాన్ని పొందవచ్చునని,శోధించి చదివితేనే నూతన రచనలకు పదును పెట్టవచ్చునని స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలితమే మనo అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వాన్నికి సూచిక అని కలెక్టర్ తెలిపారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, పదిహేను రోజులపాటు నిర్వహించే ద్విసప్తాహ వజ్రోత్సవాల్లో భాగంగా పాల్గొన్న కవులు, కళాకారులు, సమరయోధుల స్పూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని స్వాతంత్ర పోరాట సమయంలో కలంతో, గళంతో ఎంతో మంది కవులు, కళాకారులు భారత స్వాతంత్రం కోసం ప్రజలను ఉద్యమాలవైపు నడిపిస్తు చైతన్య పరిచారని, వారి స్ఫూర్తి సమాజానికి ఎంతో ఆదర్శమని స్వాతంత్ర భారతదేశాన్ని సాధించుటలో కవుల పాత్ర గొప్పదని ఎస్పీ కొనియాడారు.

కవి సమ్మేళనంలో జిల్లావ్యాప్తంగా 14 మంది కవులు, కళాకారులు వారి కవిత కావ్యాలను వినిపించారు. జిల్లా సాంస్కృతిక సారథి రవిందర్ కళా బృందం కళాకారులు ఆలపించిన గీతాలు ఆకర్షణీయoగా నిలిచాయి.

ఈ సమ్మేళనంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, డి సి ఓ ఖుర్షీద్, జిల్లా స్థాయి అధికారులు డి ఈ ఓ అబ్దుల్ హై, డి హెచ్ ఎస్ ఓ సూర్యనారాయణ, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, డి.ఎస్. ఓ. నర్సింగ్ రావు, ఆర్ డి ఓలు ఎల్ రమేష్, కొమురయ్య తహసిల్దార్ నాగ భవాని, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ప్రజాప్రతినిధులు అధికారులు కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Share This Post