స్వాతంత్ర సమరయోధుల స్పూర్తితో దేశ అభివృద్ధికి అందరూ పాటుపడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కురాకుల స్వర్ణలత అన్నారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు 15 (ఆదివారం).

స్వాతంత్ర సమరయోధుల స్పూర్తితో దేశ అభివృద్ధికి అందరూ పాటుపడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కురాకుల స్వర్ణలత అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్రదినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సంయుక్త కలెక్టర్ పోలీస్ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను బహుకరించారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల సుదీర్ఘ పోరాటం మూలంగానే దేశానికి స్వాతంత్రం సాధించుకొని నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని స్వాతంత్ర దినోత్సవం రోజు వారి సేవలను గుర్తు చేసుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తితో జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేసి జిల్లాలోని ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, జిల్లా అధికారులు డీబీసీడీఓ శైలజ, డిఎస్సిడిఓ సునీత, డిపిఆర్ఓ రవికుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీ శంకర్, సిపిఓ శామ్యూల్, పౌరసరఫరాల మేనేజర్ రాఘవేందర్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు రవికుమార్, గౌస్, ఈడిఎం శ్రీకాంత్, సెక్షన్ ఆఫీసర్లు శ్రీకాంత్, సురేందర్, జలంధర్ రెడ్డి ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post