స‌ఫాయి క‌ర్మ‌చారుల సంక్షేమానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు – జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ సభ్యురాలు అంజన పన్వార్ *

*హైదరాబాద్, ఆగస్టు 11*   స‌మాజాన్ని స్వ‌చ్ఛంగా ఉంచేందుకు కృషిచేసే స‌ఫాయి కార్మికుల సంక్షేమానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల్సిందిగా జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ సభ్యులు ఆంజనా పన్వార్  అధికారులకు సూచించారు. సఫాయి క‌ర్మ‌చారిల సంక్షేమంపై  చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను జీహెచ్ఎంసీ జలమండలి, రెవిన్యూ , పోలీసు అధికారులతో బేగంపేట్ లోని హరిత ప్లాజా లో స‌మీక్షించారు. జ‌ల‌మండ‌లి ఎండి దానకిషోర్‌, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, జీహెచ్ఎంసి జ‌ల‌మండ‌లి కార్యాల‌యాల ఉన్న‌తాధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ సభ్యురాలు ఆంజనా పన్వార్ మాట్లాడుతూ దేశాన్ని సైనికుడు ఎలా ర‌క్షిస్తాడో స‌మాజాన్ని స్వ‌చ్చంగా ఉంచ‌డానికి స‌ఫాయి కార్మికులు నిస్వార్థంగా ప‌నిచేస్తారని, దీనికి కార‌ణ‌మైన పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. మ్యాన‌వ‌ల్ స్కావెంజింగ్ పూర్తిగా నిషేదించ‌డం జ‌రిగింద‌ని, స్కావెంజ‌ర్ల పున‌రావాస చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో పాటు వారికి ఆర్థిక స‌హాయం, ప్ర‌త్యేక శిక్ష‌ణ‌, గృహ‌నిర్మాణం, వైద్య‌, ఆరోగ్య స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. సానిటేషన్ కార్మికులకు కు కనీస వేతనాలను అందించాల‌ని చ‌ట్టంలో స్ప‌ష్టంగా పేర్కొన‌డం జ‌రిగింద‌ని గుర్తుచేశారు. పారిశుధ్య కార్య‌క్ర‌మాల విధులలో ఉన్న కార్మికులందరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు
జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల బి. ఎన్. రెడ్డి నగర్ లో కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైయిన్ పూడిక పనుల్లో మరణించిన ఇద్దరు ప్రయివేట్ కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు, మేయర్ నిధులనుండి మరో రెండు లక్షల రూపాయలను అంద చేశామని తెలుప్పారు.  కార్మికులంద‌రికీ కోవిద్ వాక్సిన్ ఇప్పించామని చెప్పారు.. జ‌ల‌మండ‌లి ఎండి దాన‌కిషోర్ మాట్లాడుతూ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మురుగునీటి కాలువ‌ల క్లినింగ్ ప‌నుల‌ను చేప‌ట్ట‌డానికి ప్ర‌త్యేకంగా ఎయిర్‌టెక్ మిష‌న్ల‌ను కొనుగోలుచేసి వాటిని స‌ఫాయి క‌ర్మ‌చారిలకు అందించామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీకి చెందిన ఆఫీస‌ర్ల‌తో పాటు స‌ఫాయి క‌ర్మ‌చారి ఆందోళ‌న్‌, వాల్మికి మ‌హాస‌భ‌, అఖిల భార‌త వాల్మికి స‌భ త‌దిత‌ర సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. అనంతరం, సైదాబాద్ లోని మరణింంచిన కార్మికుల ఇళ్లకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో కల్సి సఫయి కర్మచారి కమీషన్ సభ్యురాలు ఆంజనా పన్వార్ వెళ్లి భారీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక్కొక్కరికి మేయర్ నిధులనుండి మరో రెండు లక్షల రూపాయలను అందచేశారు.

Share This Post