పత్రికా ప్రకటన
తేది:30-11-2022
నాగర్ కర్నూల్ జిల్లా.
కాపాడడం అందరి బాధ్యత – జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సబిత
భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా కల్పించిన మానవ హక్కులను కాపాడుకోవటం ప్రతి పౌరుని కర్తవ్యమని నాగర్ కర్నూల్ జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సబిత అన్నారు.
బుధవారం తాడూరు మండలంలోని ఇంద్రకల్ గ్రామ రైతు వేదికలో జిల్లా కోర్టు ఆధ్వర్యంలో న్యాయ సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సులో న్యాయమూర్తి సబిత మాట్లాడుతూ… ఎదుట వ్యక్తికి గల హక్కులను గౌరవించటం విధిగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. మనిషికి గల ఆధిపత్య ధోరణి వల్లే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాన్నారు. ప్రజలు విజ్ఞాన వంతులైనప్పుడే మార్పునకు పునాది ఏర్పడుతుందన్నారు. సమన్యాయం ప్రతి పౌరుని హక్కు అని, దాని కోసం జిల్లా, మండల న్యాయసేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించటం జరుగుతుందన్నారు.
ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం ద్వారా తన కావలసిన సమాచారాన్ని పొందవచ్చు అని అన్నారు.
ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చట్ట పరిధిలోనే ఉంటుందన్నారు.
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప మాట్లాడుతూ….
చట్టం ముందర అందరూ సమానులేనని ఉచిత న్యాయ సేవల ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టపరంగా నేరమన్నారు.
రాజీమార్గంలోని కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ సదస్సులో శ్రీనివాస్ గుప్తా బారాసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్లు రాజశేఖర్ శ్యాంప్రసాదరావు తాడూరు ఎస్సై శ్రీనివాసులు సర్పంచ్ వెంకటరమణ పీఎస్సీ చైర్మన్ సమద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
——————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.