బాలబాలికల చేతులలో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ తెలియజేశారు బాలల దినోత్సవం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక ఇమాంపేట టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయం లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు బాలలకు జీవించే హక్కు, అభివృద్ధి హక్కు, రక్షణ హక్కు, భాగస్వామ్య హక్కు కలిగి ఉన్నారని వాటిని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. బాలల సంక్షేమం ప్రభుత్వం అనుబంధ విభాగాల ద్వారా వారి సమన్వయంతో అభివృద్ధి కోసం అహర్నిశలు పాట పడుతున్నామని అన్నారు. బాలల సంక్షేమ సమితి చైర్మన్ రమణ రావు మాట్లాడుతూ బాలల వసతి, పునరావాసం, విద్య కొరకు ఎప్పుడైనా తమరిని సంప్రదించవచ్చని తెలియపరిచారు. డి ఎమ్ హెచ్ ఓ కోటా చలం మాట్లాడుతూ లింగ వివక్షత లాంటి రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ నిరంజన్, డి ఐ ఓ వెంకటరమణ , బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి, ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణీ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్, సిడి పి వో లు, dcpu సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, సఖి సెంటర్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


