హనుమకొండ:కమలాపూర్ మండలం లోని పారిశుధ్యం మెరుగుతో పాటు ప్రతిపాదిం చిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

కమలాపూర్ మండలం లోని
పారిశుధ్యం మెరుగుతో పాటు ప్రతిపాదిం చిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

మంగళవారం నాడు కలక్టర్ కమలాపూర్ మండల కేంద్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలాపూర్ మండల కేంద్రంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే మరో ట్రాక్టర్ కొనుగోలు చేయాలని సూచించారు. శానిటేషన్ పనులు ప్రతి రోజు పకడ్బందీగా చేపట్టాలని కోరారు. పాత ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కు సంబంధించిన భూమి ని గ్రామపంచాయతీ కి బదలాయించాలని,
ఆ ప్రదేశంలో నూతన బస్ స్టాండ్ నిర్మాణం ను సత్వరమే ప్రారంభించాలని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల నిధులు విడుదల చేసిందని అన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్ర నాకి కౌంపౌండ్ వాల్ ను నిర్మించాలని ఆదేశించారు.
అనంతరం కలక్టర్ డబుల్ బెడ్ రూం పనులను పరిశీలించారు. దాదాపు 320 డబుల్ బెడ్ రూం లను నిర్మిస్తున్నందున‌, రాబోయే రెండు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణం లో నాణ్యత పాటించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డియం అండ్ హెచ్ ఓ లలితాదేవి, పంచాయితీ రాజ్ ఈఈ శంకరయ్య, డీఈ దయకర చారి, ఆర్ అండ్ బి ఈఈ, డీఈ రాజు, కమలపూర్ ఇంచార్జి ఎంపిడిఓ రవి, మండల మెడికల్ అధికారిణి హర్షిణి ప్రియ తదితరులు పాల్గొన్నారు.

Share This Post