హనుమకొండ కలెక్టరేట్లో టీఎన్జీవోస్ యూనియన్ నూతన భవన ప్రారంభోత్సవం —

హనుమకొండ కలెక్టరేట్లో టీఎన్జీవోస్ యూనియన్ నూతన భవన ప్రారంభోత్సవం —

హనుమకొండ కలెక్టరేట్లో టీఎన్జీవోస్ యూనియన్ నూతన భవన ప్రారంభోత్సవం —

టీఎన్జీవోస్ యూనియన్ నూతన భవన ప్రారంభోత్సవం జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గిరిజన శాఖ మత్యులు సత్యవతి రాథోడ్,ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు, కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారు,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ గారు, ప్రధాన కార్యదర్శి రాయి కంటి ప్రతాప్ గారుల చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, టీ ఎన్ జీ ఓస్ కేంద్ర సంఘ నాయకులు హనుమకొండ జిల్లా టీ ఎన్ జీ ఓస్ నాయకులకు అభినందనలు తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు గారు ఉద్యోగుల సమస్యలన్నీ టీ ఎన్ జీ ఓస్ యూనియన్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్,ప్రధాన కార్యదర్శి రయికంటీ ప్రతాప్ నాయకత్వంలో ఎప్పటికప్పుడు పరిష్కారిస్తున్నారని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా టీ ఎన్ జీ ఓస్ కీర్తి ప్రతిష్టల గురించి తెలంగాణ ఉద్యమంలో టీ ఎన్ జీ ఓస్ యూనియన్ పోషించిన అద్భుతమైన పాత్ర గురించి ప్రస్తావించడం మరియు టీ ఎన్ జీ ఓస్ యూనియన్ అధ్యక్షులు మమిల్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రయికంటీ ప్రతాప్ ల పేర్లను ప్రస్తావించడం అనేది టీ ఎన్ జీ ఓస్ యూనియన్ కు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు అని పేర్కన్నారు.అసెంబ్లీ చరిత్రలో టీ ఎన్ జీ ఓస్ ప్రస్తావన చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించబడినదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరీ సోమయ్య, అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరు వేణుగోపాల్ కోశాధికారి పనికెల రాజేష్ కేంద్ర సంఘ నాయకులు రాజేష్ కుమార్, శ్యామ్ సుందర్ ,కత్తి రమేష్, వరంగల్ అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్, భూపాలపల్లి అధ్యక్షులు బూరుగు రవీ, హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు, అంజడ్ అలి,ములుగు అధ్యక్షులు జ్ఞానేశ్వర్, జనగాం అధ్యక్షులు ఖాజా షరీఫ్, మహబూబాబాద్ అధ్యక్షులు శ్రీనివాస్,మోయిజ్,రాజ్యలక్ష్మి,సింధు రాణి,జయంత,సరస్వతి,రాజమౌళి,ఉస్మాన్ అలీ, వసిమా,యమున, రాజమౌళి,సురేష్,శ్రీనివాస్,లక్ష్మి ప్రసాద్,రాజేష్ ఖన్నా,రాంప్రసాద్,నరేష్,ప్రవీణ్,గోపి కృష్ణ,రమేష్ తదతరులు పాల్గొన్నారు.   

Share This Post