హనుమకొండ. కాళోజీ జయంతి సందర్భంగా హన్మకొండ లోని, నక్కలగుట్ట వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నమస్సుమాంజలి ఘటించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ
కాళోజీ నారాయణరావు, కాళోజీ గా, కాళన్న”గా సుపరిచితులు అని అన్నారు.

కాళోజీ తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమ ప్రతిధ్వని అని కొనియాడారు.

పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు కాళోజి అని అన్నారు.

అనాడు నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా కలం ఎత్తాడు.
స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు.
కాళోజీ…తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

కాళోజీ ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు  పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిండు.

అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు. 

1939లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాలనుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 

1930 నుంచే కాళోజీ  గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు.

తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష.

సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి,  జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు.

విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు.

తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు.

రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను అతని అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. 

వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు కాళోజీ నగర బహిష్కరణకు గురయ్యారు.

స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు,వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర చాలా విలువైనది.

1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 

1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. 

కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

భారత ప్రభుత్వం అత్యున్నత  పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

“సామాన్యుడే నా దేవుడు” అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు.

కాళోజీ మరణానంతరం అతని పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు.

కాళోజీ జన్మదినాన్ని సీఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా గౌరవిస్తున్నది

ప్రతి ఏటా ప్రముఖ కవులను గుర్తించి కాళోజీ అవార్డులతో గౌరవిస్తున్నది

సీఎం కెసీఆర్ వరంగల్ లో ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీ కి కాళోజీ పేరు పెట్టారు.

అలాగే హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం పేరిట ఆడిటోరియంను నిర్మిస్తున్నా0.

కాళోజీ ప్రజా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం

కాళోజీ ఆశ‌యాల‌కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పాల‌న సాగుతుంది.

కాళోజీ, జ‌య‌శంక‌ర్ సార్లు వ‌రంగ‌ల్ బిడ్డ‌లు కావడం ఈ ప్రాంత‌ ప్ర‌జ‌ల అదృష్టం.

కాళోజీ అందించిన స్పూర్తితోనే నేను రాజ‌కీయ0గా ఎదిగాను.

కాళోజీ, జ‌య‌శంక‌ర్‌లు పుట్టిన గ‌డ్డ అభివృద్దికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌ ఇస్తున్నది

ఈ కార్యక్రమంలో రాజ్య‌స‌భ స‌భ్యులు బండా ప్ర‌కాష్‌, మేయ‌ర్ గుండు సుధారాణి, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌ జిల్లాల క‌లెక్ట‌ర్లు బి.గోపి, రాజీవ్‌గాంధీ హనుమంతు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్రావీణ్య‌, ఉద్యోగ సంఘాల నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share This Post