హనుమకొండ జిల్లాలో ఆగష్టు 25 నుండి 31 వరకు జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

హనుమకొండ

జిల్లాలో ఆగష్టు 25 నుండి 31 వరకు జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.

సోమవారం నాడు కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,86,324 మంది 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని, వారందరికి జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో అల్బెండజోల్ మాత్రలు వేయాలని ఆదేశించారు. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్రను, 2 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి ఒక మాత్ర పూర్తిగా వేయించాలని అన్నారు. జిల్లాలోని ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ఇంటింటికి వెళ్లి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను వంద శాతం వేయాలని అన్నారు. కొవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ అల్బెండజోల్ మాత్రలను 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి వేయాలని సూచించారు. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలందరికి సగము మాత్రను నీటితో కలిపి ఇవ్వాలని అన్నారు. 2 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఒక మాత్ర చొప్పున వేసి పూర్తిగా నమలమని చెప్పాలని, మాత్రలను ఇచ్చే సమయంలో త్రాగు నీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మాత్రలను ఇంటి బయటనే ఉండి పిల్లలకు వేయించాలని అన్నారు. మాత్రలు వేయు సమయంలో వారి ఇంటిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నవ అనే విషయాన్ని కనుక్కోవాలని, ఎవరికైనా దగ్గు, జ్వరము, శ్వాస తీసుకొవడంలో ఇబ్బంది లాంటి కోవిడ్ లక్షణాలు ఉన్న పిల్లలకు మాత్రలు వేయవద్దని తెలిపారు. ఈ లక్షణాలు ఉన్న పిల్లల వివరాలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రాల వైద్యాధికారులకు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంపైతల్లిదండ్రులకు ,పిల్లలకు అవగాహన కల్పించాడానికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన ఆదేశించారు.విద్యా శాఖ, వివిధ సంక్షేమ శాఖ ల అధికారులు ఈ కార్యక్రమం ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగ పరుచుకొనే విధంగా తగినచర్యలుతీసుకోవాలని ,సంబందిత శాఖలు సమన్వయం తో ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలోడియంహెచ్ వో డాక్టర్ లలితాదేవి,డీఇఒ నారాయణ రెడ్డి,డిప్యూటీ డియంహెచ్ ఓ యాకుబ్ పాషా
డీ యస్ ఒ కృష్ణా రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ గీత లక్ష్మీ ,సంక్షేమ శాఖ అధికారులు నిర్మల,శ్రీను,సబిత
జిల్లా టిబి కంట్రోల్ అధికారి మల్లి కార్జున్,,గోపాల్, ఉమా శ్రీ,రజిత రాణి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post