హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఓటరు నమోదు పక్రియ లో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గార్లతో మరియు భూత్ లెవల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎలెక్టోరల్ రోల్, స్వీప్ ఆక్టివిటీస్ పైన ఎన్నికల ఆబ్జర్వర్ అహ్మద్ నయీమ్ ఐఏఎస్ గారు గురువారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు

వార్త ప్రచురణ
తేదీ.24.11.2022.
వరంగల్ జిల్లా.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఓటరు నమోదు పక్రియ లో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గార్లతో మరియు భూత్ లెవల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎలెక్టోరల్ రోల్, స్వీప్ ఆక్టివిటీస్ పైన ఎన్నికల ఆబ్జర్వర్ అహ్మద్ నయీమ్ ఐఏఎస్ గారు గురువారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నిక అబ్జర్వర్ గారు మాట్లాడుతూ జిల్లాలలో ఓటరు నమోదు ప్రక్రియ100% చేయుటకు కృషి చేయాలని వారు అన్నారు. పోలింగ్ బూత్ లలో ఓటు వేసే సమయానికి
విఐపిలు పేర్లు లేవనే కంప్లైంట్ లేకుండా చూడాలని, ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని వారు అన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం లో రాజకీయ పార్టీ ల నాయకులు సహకరించాలని ఈ సందర్భంగా ఎన్నికల అబ్సర్వర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి గారు మాట్లాడుతూ స్పెషల్ సమ్మరి రివిజన్ కార్యక్రమాలు ఈ నెల 26,27 మరియు డిసెంబర్ 03,04 లలో ఉందని, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటరు నమోదు చేసుకునే విధంగా అవేర్నెస్ కల్పిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు.

ఓటరు లిస్టులో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నట్లు అయితే బూత్ లెవల్ ఆఫీసర్స్ అబ్జెక్షన్ డిసెంబర్ 26 , అలాగే ఫైనల్ పబ్లికేషన్ జనవరి 5 న ఉన్నదని, ఎలక్షన్స్ గైడ్ లైన్స్ పాటిస్తున్నామన్నారు. స్వీప్ నోడల్ అధికారులను నియమించి స్వీప్ ఆక్టివిటీస్ ను వేగవంతం చేశామన్నారు.

జిల్లాలో మూడు నియోజక వర్గాలలో మొత్తం ఓటర్ల సంఖ్య 6 లక్షల 99 వేల 894 ఓటర్లు ఉన్నారని, జిల్లా పాపులేషన్ రేషియో 718 గా ఉందని వారు అన్నారు.

ఫైనల్ పబ్లికేషన్ కి తక్కువ సమయం ఉన్నందున 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటర్గా నమోదు చేసుకునేందుకు ఎస్ ఎస్ జి మెంబెర్స్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని తహసిల్దార్లు, బూత్ లెవెల్ అధికారులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Share This Post