హనుమకొండ జిల్లా డి‌ఎం‌హెచ్‌ఓ గా భాద్యతలు స్వీకరించిన డాక్టర్.బి. సాంబశివ రావు గారు

హనుమకొండ జిల్లా డి‌ఎం‌హెచ్‌ఓ గా భాద్యతలు స్వీకరించిన డాక్టర్.బి. సాంబశివ రావు గారు

తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం
(జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం – హనుమకొండ)
పత్రిక ప్రకటన/ప్రసార నిమిత్తం తేది: 22/04/2022

హనుమకొండ జిల్లా డి‌ఎం‌హెచ్‌ఓ గా భాద్యతలు స్వీకరించిన డాక్టర్.బి. సాంబశివ రావు గారు

హనుమకొండ జిల్లా డి‌ఎం‌హెచ్‌ఓ గా ఈ రోజు డాక్టర్.బి. సాంబశివ రావు గారు భాద్యతలు స్వీకరించటం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా డి‌ఎం‌హెచ్‌ఓ గా పని చేస్తున్న డాక్టర్.బి. సాంబశివ రావు గారిని హనుమకొండ డి‌ఎం‌హెచ్‌ఓ గా నియమించటం జరిగింది. ప్రస్తుత డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్.కె. లలితా దేవి గారు హనుమకొండ పి‌ఓడిా‌టి‌టి గా కొనసాగనున్నారు.
ఈ సంధర్భముగా డాక్టర్.బి. సాంబశివ రావు గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్యశాఖా మాత్యుల ఆలోచనలకు అనుగుణంగా, గౌరవ రాష్ర్ట అధికారులు, జిల్లా ప్రజా ప్రతి నిధులు, జిల్లా కలెక్టర్ గార్ల ఆదేశాల కనుగుణముగా ప్రోగ్రాం అధికారులు, వైధ్యాధికారులు, సిబ్బంది తో సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించేలా పని చేస్తానన్నారు. గతంలో పని చేసిన అనుభవంతో అన్ని హెల్త్ ఇండికేటర్స్ లో జిల్లాను మెరుగైన స్థానంలో ఉండేలా కృషి చేస్తానన్నారు.
ఈ సంధర్భంగా నూతనంగా భాధ్యతలు స్వీకరించిన డి‌ఎం‌హెచ్‌ఓ ను అలాగే గత 2 సo. ల 4 నెలల పాటు డి‌ఎం‌హెచ్‌ఓ గా సేవలందించిన డాక్టర్.కె. లలితా దేవి గారిని ప్రోగ్రాం అధికారులు, కార్యాలయ సిబ్బంది, పలు అసోసియేషన్ల సభ్యులు ఘనంగా సన్మానించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో వరంగల్ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్. వెంకట రమణ, అడిష్ నల్ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్. టి. మదన్ మోహన్ రావు, డిప్యూటీ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్. ఎం‌డి. యాకూబ్ పాషా, డి‌ఐ‌ఓ డాక్టర్. గీతా లక్ష్మి, ఎన్‌సి‌డి అధికారి డాక్టర్. ఉమాశ్రీ, డాక్టర్ వాణి శ్రీ, రూరల్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్. మధుసూదన్, డాక్టర్ గోపాల్ రావు, డెమో వి. అశోక్ రెడ్డి, ఏ‌ఓ యాదగిరి, DPHNO శ్రీమతి సుశీల,స్టాటిస్టికాల్ అధికారి ప్రసన్నకుమార్, HEEO L. చంద్రశేఖర్ పలు అసోసియేషన్ల నుండి యదా నాయక్, నెహ్రూ చంద్, బి. సుదర్శన్ గౌడ్ సుధాకర్,టి. మాధవరెడ్డి, ఎన్‌హెచ్‌ఎం డి‌పి‌ఓ శ్రీనివాస్, రాజేశ్ ఖన్నా, రమేశ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని ఘనంగా
సన్మానించారు. SD/-
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి
హనుమకొండ జిల్లా
జిల్లా పౌర సంబందాల శాఖాధికారి గారి ద్వారా అన్ని పత్రికలలో ప్రచురణ నిమిత్తం సమర్పించనైనది.

Share This Post