హనుమకొండ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురవనున్న నేపథ్యంలోఅధికారులుఅప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

Press release
హనుమకొండ

జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురవనున్న నేపథ్యంలోఅధికారులుఅప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

రాబోయే ఇరవై నాలుగు గంటల లో భారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ హెచ్చరించడం తో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని‌,ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు.కలక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని ,ఇందుకోసం కలక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1115 ని కేటాయించినట్లు తెలిపారు.
అధికారులు ఎవరూ హెడ్క్వార్టర్లను వదిలివెళ్ళరాదని,సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేయరాదని ఆయన ఆదేశించారు.

Share This Post