హనుమకొండ. తేది.19.08.2021 పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులను వేగవంతంగా పూర్తి చేయండి : హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

హనుమకొండ.
తేది.19.08.2021

పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులను వేగవంతంగా పూర్తి చేయండి : హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

పట్టణ ప్రగతి , హరితహారం పురోగతి పై బల్దియా అధికారులతో సమీక్ష..

పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, ఇంచార్జి జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి ఆయన బల్దియా అధికారులతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల ప్రగతిని సమీక్షించి సమర్ధంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలో గుర్తించిన నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా సాధించాలని అన్నారు.
వరంగల్ మహా నగర పాలక సంస్థ వ్యాప్తంగా పట్టణ ప్రగతి లో రూ 179.34 కోట్లతో 419 అభివృద్ధి పనులు మంజూరు కాగా రూ 106.44 కోట్లతో 259 పనులు పూర్తయ్యాయని 31 పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. మిగిలిన 119 పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అందులో సమగ్ర వెజ్ నాన్ వెజ్ మార్కెట్, డంపింగ్ యార్డులకు, గ్రేవ్ యార్డులకు ప్రహరీ గోడలు, కమ్యూనిటీ హాల్, బిటి, సిసి రోడ్ ల నిర్మాణం, స్ట్రామ్ వాటర్ డ్రైన్, మురుగుకాలువలు, సెంట్రల్ మైడెన్ల, పార్కుల అభివృద్ధి, ఖాళీ స్థలాలకు ప్రహరిగొడ , వీధిదీపాల, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు, స్వచ్ఛ వాహనాల కొనుగోలు ఉన్నాయన్నారు.
జిడబ్ల్యూ ఎంసీ పరిధిలో గుర్తించిన 92 లే అవుట్ ఖాళీ స్థలాల్లో 47 కు మాత్రమే ప్రహరిగొడ లు నిర్మించారని, మిగతా వాటికి తక్షణమే ప్రహరిగొడ లు ఏర్పాటు చేస్తూ, ఇంకను ఉన్న లే అవుట్ ఖాళీ స్థలాలను
పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా 3 రోజుల్లోగా గుర్తించాలన్నారు. ప్రహరిగొడ లున్న
47 స్టలాల్లో మొక్కలను నాటాలని సి హెచ్ ఓ ను ఆదేశించారు.
హన్మకొండ ఆర్ అండ్ బి అతిధి గృహం వెనుక భాగంలో 3 ఎకరాల స్థలంలో
సమగ్ర వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

హరితహారం లో నగరవ్యాప్తంగా 13 లక్షల మొక్కలు నాటే లక్ష్యం కాగా ఇప్పటివరకు 10 లక్షలు నాటారని, మిగిలిన లక్ష్యాన్ని వేగవంతంగా సాదించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి అదనపు కమిషనర్ నాగేశ్వర్, బల్దియా ఎస్ ఈ సత్యనారాయణ, సి పి వెంకన్న, సిహెచ్ ఓ సునీత, సి ఎం హెచ్ ఓ డాక్టర్ రాజీ రెడ్డి, డిసిపి ప్రకాశ్ రెడ్డి, ఈ ఈ లు శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రావు, రాజయ్య, డి ఈ లు, ఏ ఈ లు, ఏ సిపి, టిపిఎస్ లు, టిపిబిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post