హనుమకొండ. తేది.19.8.2021. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి : జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

హనుమకొండ.
తేది.19.8.2021.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి : జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

పారిశుద్ధ్య నిర్వహణపై
బల్దియా అధికారులతో సమీక్ష..

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇంచార్జి జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఆయన అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి బల్దియా అధికారులతో సమావేశమై పారిశుద్ధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధుల నివారణపై కూలంకషంగా సమీక్షించి పటిష్టంగా
నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిడబ్ల్యూ ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగామురుగుకాలువలలో, వీధుల్లో, రహదారులపై చెత్తా పేరుకుపోయి ఉందన్నారు. సానిటరీ సూపర్ వైజర్లు, ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్యం సరిగా జరిగేలా నిత్యం పర్యవేకక్షించాలని అన్నారు.
వారం రోజుల్లోగా పారిశుద్ధ్యం మెరుగుపడాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
హోటళ్ల , కమర్షియల్ దుకాణాల ముందు వ్యర్ధాలను పడేస్తున్న వారిపై జరిమానాలు వేస్తూ కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
వర్షాకాలం దృష్ట్యా
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణకు తరచుగా దోమల ఫాగింగ్, ఓ హెచ్ ఎస్ ఆర్ లను శుభ్రం, గడ్డి పొదలను, చెత్త చెదారం శుభ్రం చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలని, మురుగునాలలలో ఎప్పటికప్పుడు పూడికతీసి మందు స్ప్రే చేయాలన్నారు.
ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే హోటళ్ల ఫ్రెష్ వేస్ట్, గార్బేజ్ నుండి బయో ట్రీట్మెంట్ నిర్వహణకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అన్ని స్వచ్ఛ వాహనాలకు వెహికల్ ట్రాక్ సిస్టం ఏర్పాటు చేయలని ఆదేశించారు. పోతన, బాల సముద్రం ట్రాన్ఫర్ స్టేషన్ల వద్ద షెడ్ ల నిర్మాణం సెప్టెంబర్ చివరి కల్లా పూర్తవ్వాలని సూచించారు. అంబెడ్కర్ భవన్ వద్ద కోత్త డ్రైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజీ రెడ్డి, ఎస్ ఈ సత్యనారాయణ, ఉప కమిషనర్ లు జోనా, రవీందర్, డి ఎఫ్ ఓ కిషోర్,
హెచ్ ఓ ప్రెసిల్లా, సి శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రావు, రాజయ్య, సానిటరీ సూపర్ వైజర్లు, ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post