హనుమకొండ. దళిత బంధు ఇంటింటి సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలి:: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

ప్రెస్ రిలీజ్.
తేది.26.08.2021.


దళిత బంధు ఇంటింటి సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దళిత బంధు ఇంటింటి సర్వే పై క్లస్టర్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులు, సపోర్టింగ్ స్టాఫ్, పంచాయితీ కార్యదర్శులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హుజురాబాద్ నియోజక వర్గం లోని కమలాపుర్ మండలంలోని గ్రామాలను 11 క్లస్టర్లు విభజించి 11 మంది జిల్లా అధికారులను, 32 బృందాలకు స్పెషల్ ఆఫీసర్స్ వారికి ఒకొక్క బృందానికి ఆరుగురు సపోర్టింగ్ స్టాఫ్ ను దళిత బంధు ఇంటింటి సర్వే కొరకు నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 27, 28 తేది లలో సర్వే టీములు ఉదయం 8.00 గంటలకు నుండి సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. దళిత వాడలోని ప్రతి ఇంటింటికి క్లస్టర్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సహాయ సిబ్బంది వెళ్లి ఆన్ లైన్ డాటా తో పాటు ఆఫ్ లైన్ డాటా కూడా సేకరించాలని ఆదేశించారు. సేకరించిన డాటా వివరాలను దళిత బంధు యాప్ లో నమోదు చేయాలని అన్నారు. ఈ సర్వే టీముతో పాటు ఆ మండలానికి కేటాయించిన బ్యాంకు అధికారులు కూడా పాల్గొని వెంటనే దళిత కుటుంబాల లబ్ధిదారులకు కొత్తగా తెలంగాణ దళిత బంధు బ్యాంక్ అక్కౌంట్ ఖాతాలను తెరుస్తారని తెలిపారు. కమలపూర్ మండలం లో దళిత బంధు ఖాతాలు తెరుచుటకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ ను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
గురువారం సాయంత్రం దళిత వాడల్లో సర్వే టీములు వస్తున్నట్లు టాం టాం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులకు నిరుపేద దళితుల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసి సమాజంలో ఇతర కులాలతో సమానంగా నిలుపుటకు దళిత బంధు పథకం క్రింద ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అందించే అద్బుత అవకాశం వచ్చిందని అన్నారు. అధికారులు , సిబ్బంది అంకిత భావంతో పారదర్శకంగా ఓపిక, సేవభావం తో ప్రతి దళిత కుటుంబాలను సర్వే చేసి వివరాలను సేకరించి, పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అన్నారు. దళిత బంధు సర్వే పై ప్రతి మండలానికి ఒక రాష్ట్ర స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ తెలిపారు. వీరు కూడా దళిత బంధు ఇంటింటి సర్వే పై ప్రతి రోజు గ్రామాలలో పర్యటిస్తూ సర్వేను పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎల్డిఎం మురళీమోహన్ రావు, దళిత బంధు స్టేట్ కమిటీ మెంబర్ కృష్ణవేణి, (ఆర్డీవో స్టేషన్ ఘనపూర్), యూనియన్ బ్యాంక్ డిజిఎం శంకర్ లాల్, క్లస్టర్ అధికారులు డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, డిపిఓ జగదీశ్వర్,పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, డిఎండబ్లుఓ శ్రీను, జీఎం ఇండస్ట్రీస్ హరిప్రసాద్, డిబిసిడబ్లుఓ రాంరెడ్డి, ఈడిఎస్సి కార్పొరేషన్ మాదవిలత, ఏ డి అగ్రికల్చర్ దామోదర్, డిడి గ్రౌండ్ వాటర్ శ్రీనివాస్ రావు, డిసిఓ నాగేశ్వరరావు, ఏ డి పశుసంవర్ధక శాఖ, పరకాలరవికుమార్, స్పెషల్ ఆఫీసర్లు,బ్యాంక్ అధికారులు, సపోర్టింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post