హనుమకొండ. ప్రతి సోమవారం ప్రజల నుండి వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంద్యారాణి అధికారులకు ఆదేశించారు.

సోమవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇదివరకు జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన ప్రజా ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని ,వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంద్యారాణి అధికారులను ఆదేశించారు. ఈ రోజు ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 121 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ- 57, వైద్య ఆరోగ్య శాఖ – 4, గ్రేటర్ మున్సిపాలిటి -12, డిఆర్డిఓ -11, పంచాయితీ రాజ్ – 4, ఇతర శాఖలకు సంబంధించినవి – 33 వినతులు వచ్చాయని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యు అధికారి, వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post