హనుమకొండ: ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లతో కలసి అభివృద్ధికార్యక్రమాలపై సమీక్ష సమావేశం

కమలాపూర్ మండలంలోప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వవిప్ బాల్క సుమన్ ఆదేశించారు.

మంగళవారం నాడు కలక్టరేట్
సమావేశ మందిరంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లతో కలసి అభివృద్ధికార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వారం రోజులలో నిర్దేశించిన అన్ని రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల వేగవంతానికి అవసరమైన లేబర్ సంఖ్య ను పెంచుకోవాలని, ఇరవై నాలుగు గంటలు పనులు ముమ్మరంగా కొనసాగాలని తెలిపారు. మండలం లోని రహదారులు, మురుగు కాల్వలు, తాగునీరు, విద్యుత్‌
సమస్యలు ఉండకూడదని స్పష్టం చేశారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం, మిషన్ భగిరధ పనులు, డబుల్ బెడ్ రూం నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా సమన్వయం తో అధికారులు పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి సమస్యను అధికారులు సమర్థవంతంగా పరిష్కరించుందకు ముందుకు సాగాలని సూచించారు. కమలాపూర్ మండలం లోని గ్రామస్ధాయిలో అత్యవసర పనుల జాబితా ను రూపోందిచాలని రహదారుల వెంబడి ఎవెన్యు ప్లాంటేషన్ పకడ్బందీగా చేపట్టాలని, ఆకర్షణీయమైన మొక్కలు పెంచాలని అన్నారు.

పరకాల శాసనసభ సభ్యులు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, ఎమైన సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. సర్పంచ్ చేసిన వివిధ అభివృద్ధి పనుల బిల్లు లను సత్వరమే సమర్పించాలని సూచించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు.

కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను డీపిఓ స్వయంగా పర్యవేక్షించాలనిఆదేశించారు. పనులు నూటికి నూరు శాతం పూర్తి కావాలని అన్నారు. ఇంజనీరింగ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని సూచించారు. పూర్తి అయిన పనులు సత్వరమే ఆన్లైన్ లో జనరేట్ చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, డిఆర్వో వాసు చంద్ర, డిపిఓ జగదీశ్వర్, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, కూడ ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డి, కమలపూర్ ఎంపిడివో పల్లవి, ఇంజనీరింగ్ అధికారులు, కమలపూర్ మండలములోని వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post