హనుమకొండ. ప్రశాంత వాతావరణం లో గణపతి విగ్రహాలు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.

గురువారం నాడు కలక్టర్ కమిషనర్ అఫ్ పోలీస్ తరుణ్ జోషి తో కలసి నిమజ్జనం జరిగే హసన్ పర్తి పెద్ద చెరువు, బందన్ చెరువు,పద్మాక్షమ్మ చెరువులను తనిఖి లను నిర్వహించారు.ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేట్టు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలుతీసు కోవాలని అన్నారు. ప్రధానంగా నిమజ్జనం జరిగే చెరువుల వద్ద వరంగల్‌ నగర పాలక సంస్థ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ సమన్వయము తో పని చేయాలనీ అన్నారు.నిజమజ్జనాన్ని తిలకించేందుకు నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నందువల్ల వారిని నియంత్రించేందుకు చెరువుల వద్ద భారీకేడ్లను ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. మచెరువుల వద్ద, వాటి చుట్టూ ఉన్న ముళ్ళపొదలను తొలగించాలని విగ్రహాలను తీసుకువచ్చే వాహనాలు వెళ్ళేందు కు వీలుగా చెరువుకట్ట వరకు రోడ్లను మరమ్మతు చేయాలని అన్నారు. నీటిపారుదల, అగ్రిమాపక, మత్స్యశాఖ, కార్పొరేషన్‌, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, రెవెన్యూ, వైద్య తదితర శాఖల అధికారులు, సిబ్బందిని నిమజ్జనస్థలాల్లో ఉండి నిమజ్జన పనులను వేగవంతం చేయలని అన్నారు. ప్రమాదం జరిగితే అత్యవసర చికిత్సకోసం డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందితో కూడిన అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ పోలీసులు నిరంతరం ట్రాఫిక్ ను క్రమబద్దికరిచాలని, విగ్రహాలతో వాహనాలు తరలివెళ్ళే రహదారులపై నుంచి ఇతర వాహనాలు వెళ్ళకండా ట్రాఫిక్‌ను మళ్ళిoచాలని అన్నారు. ప్రతి రోజు చేరువలలో మూడు షిఫ్ట్ ల వారిగా పారిశుద్యం పనులు చేపట్టాలని అన్నారు. చాలా విగ్రహాలు సాయంత్రం నిమజ్జనం కానున్న దృష్ట్యా చెరువుల వద్ద ప్లడ్‌లైట్లను ఏర్పాటు చేయాలనీ అన్నారు. చెరువుల వద్ద పెట్టాలనుకున్న క్రేన్‌లు, ప్రొక్లేయిన్లు, తెప్పలు, భారీకేడ్స్‌ నిర్మాణం, ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతు, గజ ఈతగాళ్ళ అందుబాటులో , తదితర అంశాలపై ఆరా తీశారు. నిమజ్జనం సందర్భంగా రెస్క్యూ బృందాలను అవసరమైనంత మేరకు అందుబాటులో ఉంచాలనీ, నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు చెరువుల వద్దనే ఉండాలన్నారు. నిర్దేశిత చెరువుల్లోనే అవి నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వాసుచంద్ర, డిసిపి పుష్ప, ఈఈ లక్ష్మరెడ్డి, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, హనుమకొండ తహసీల్దార్ రాజుకుమార్, ఎలక్ట్రిటిసిటీ ఏఈ లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post