హనుమకొండ. రక్త దానం ప్రాణ దానం తో సమానమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.

మంగళవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్డీఓ, రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ శిబిరం లో డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్ కుమార్ స్వయంగా రక్త దానం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానంపై అవగాహన పెంచుకొని ప్రజలు స్వచ్ఛందంగా రక్త దాతలుగా ముందుకు రావాలన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం అవసరం ఉన్న జిల్లా ప్రజలకు తక్కువ ధరకు రక్తాన్ని అందించలని రెడ్ క్రాస్ ప్రతినిధులను కోరారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఓ సారి ఐనా రక్త దానం చేయాలని, మల్ల రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కొందరికి రక్తం ఇవ్వడం వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు ఏర్పడతాయనే అపోహలు ఉంటాయని, రక్తం ఇవ్వడం వల్ల ఎటువంటి ఆరోగ్య పరమైన సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ రక్త దాన శిబిరంలో 106 మందికి పైగా రక్తదానం చేశారు. రక్త దానం చేసిన వారిలో డిఆర్డీఏ కార్యాలయ లోని 12 విభాగాలు, సెర్ఫ్, పిన్షన్ సిబ్బంది తో పాటుహసన్ పర్తి, సిద్దాపూర్ గ్రామాలకు చెందిన 30 మంది యువకులు రక్త దానం చేశారు. రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికీ పండ్లు, ఎనర్జీడ్రింక్ లను అందించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, డిపిఓ జగదీశ్వర్, రెడ్ క్రాస్ ఛైర్మన్, Dr. P. Vijaya Chander Reddy, పాలకమండలి సభ్యులు, E.V.Srinivas Rao, జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు, టీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్, ఎంపిడివోలు, ఎంపీవోలు, సర్పంచులు, కార్యదర్శులు, ఏపీవోలు, ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post