హమాలీలకు దసరా బోనస్ అందించిన అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

హమాలీలకు  దసరా బోనస్ అందించిన అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం

హమాలీలకు దసరా బోనస్ అందించిన అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

80 మంది హమాలీలు, 3 మంది స్లీపర్ లకు తలా రూ.6,200/- బోనస్

పెద్దపల్లి, సెప్టెంబర్ – 30:

జిల్లా పౌర సరఫరాల సంస్థ లో పనిచేస్తున్న హమాలీలకు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ శుక్రవారం తన ఛాంబర్లో దసరా బోనస్ అందించారు.

జిల్లా పౌర సరఫరాల సంస్థ లోని మూడు మండల స్థాయి స్టాక్ పాయింట్లలో పనిచేసే 80 మంది హమాలీలకు, ముగ్గురు స్వీపర్లకు మొత్తం 83 మందికి ఒకరికి రూ.6,200/- చొప్పున మొత్తం రూ.5,14,600/- దసరా బోనస్ ను అదనపు కలెక్టర్ కలెక్టర్ అందించారు.

ఈ సందర్భంగా హమాలీలకు అదనపు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post