హరితహరం లక్ష్యాల పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం—-1
త్వరితగతిన హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
హరిత ప్రణాళికలను కట్టుదిట్టంగా అమలు చేయాలి
మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యచరణ
సెప్టెంబర్ 25లోపు నాటిన మొక్కల జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి
హరితహారం అంశం పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, సెప్టెంబర్ 15
:- త్వరితగతిన జిల్లాలో హరితహారం లక్ష్యాలు పూర్తి చేసే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. హరితహారం లక్ష్యాలు, మొక్కల జియో ట్యాగింగ్ , మెగా పార్క్ ల ఏర్పాటు వంటి పలు అంశాల పై కలెక్టర్ సోమవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసిఆర్ చాలా ప్రాధాన్యతతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభించారని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా రుపొందించుకున్న హరిత ప్రణాళికలను పకడ్భందిగా అమలు చేయాలని, 10% గ్రీన్ బడ్జేట్ నిధులను పూర్తి స్థాయిలో సద్వీనియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 7వ విడత హరితహారంలో భాగంగా జిల్లాలో నాటిన మొక్కల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామ పంచాయతి పరిధిలో సిద్దం చేసుకున్న ట్యాంకర్లు, ట్రాక్టర్లను సంపూర్ణంగా వినియోగించుకోవాలని అన్నారు. హరితహారం లక్ష్యాల మేరకు మొక్కలు నాటాలని, దీనికి సంబంధించి గుంతలు తవ్వడం ప్రక్రియ పురోగతి, మొక్కలు నాటడం తదితర ఆరా తీశారు. సెప్టెంబర్ 25 వరకు జాతీయ ఉపాధి హమి కింద నాటిన మొక్కల జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ధర్మారం, జూలపల్లి, ఓదెల, రామగిరి , శ్రీరాంపూర్ మండలాలో జియో ట్యాగింగ్ చాలా నెమ్మదిగా జరుగుతుందని, సదరు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. 7వ విడతలో భాగంగా ఇంటింటికి పంపిణీ చేసిన మొక్కల జియో ట్యాగింగ్ సెప్టెంబర్ 17 వరకు పూర్తి చేయాలని, దీని జిల్లా పంచాయతి అధికారి పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అటవీ శాఖ ద్వారా 110 స్థలాలో నాటుతున్న 5 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 20లోపు పూర్తి చేయాలని, మున్సిపాల్టీలలో నాటిన మొక్కలకు సైతం సెప్టెంబర్ 20లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మల్టిలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పురొగతికి సంబంధించి ఎంపిడిఒలు సంపూర్ణ వివరాలతో నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు 70% కంటే తక్కువ మొక్కల సంరక్షణ ఉన్న ప్రాంతాలో ఎంపిడిఒలు అదనపు మొక్కలు నాటి గ్యాప్ పుడ్చివేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలు, మున్సిపాల్టీలో ఉన్న వాహనాల ద్వారా అవెన్యూ ప్లాంటేషన్ నీటి సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ప్రజలను సైతం హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, గ్రామాలు, పట్టణాలో వార్డుల వారిగా ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటిలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్,డి.ఎఫ్.ఓ. రవి ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

      జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి గారిచే జారీచేయబడినది.

Share This Post