హరితహారంతో పట్టణానికి సరికొత్త శోభ… రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం

హరితహారంతో పట్టణానికి సరికొత్త శోభ…

మహబూబాబాద్, జూలై-24:

జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి మహబూబాబాద్ పట్టణానికి సరికొత్త శోభను తేవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.

శనివారం మహబూబాబాద్ మండలం jamandlapally జాతీయ రహదారి పక్కన అటవీ శాఖ చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ లతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణం ముఖద్వారాల వద్ద చేపట్టే అవెన్యూ ప్లాంటేషన్ అందంగా చేపట్టాలన్నారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలి అన్నారు అదేవిధంగా పూల మొక్కలు కూడా నాటాలి అన్నారు.

ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి రవికిరణ్ ఎక్సైజ్ శాఖ అధికారి దశరథ్ అటవీ శాఖ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి అటవీశాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారి జారీ చేయడమైనది

Share This Post