హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి


ప్రచురణార్థం.. 2 తేదిః 03-12-2021
హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల, డిసెంబర్ 03: జిల్లాలో హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పట్టణ అభివృద్ది పనులపై జూమ్ వెబ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, పరిశీలిస్తున్నందున, అధికారులు, సిబ్బంది అప్రమత్తమై హరితహారం, ప్లానిటేషన్ వంద శాతం పూర్తయి, ప్రభుత్వం ఆశించిన ఫలితాన్ని అందించాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటడం మాత్రమే కాకుండా నాటిన ప్రతి మొక్కకు నీరు అందించడం, చనిపోయిన, చెడిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటడం, మొక్కలకు ట్రిగార్డులు పెట్టడం, సాసరింగ్ ఎర్పాటు చేసి మొక్కలను సంరక్షించాలని సూచించారు.
వ్యాక్సినేషన్ లో బాగంగా జిల్లా ప్రతిరోజు ప్రగతిని మెరుగు పరిచే దిశగా, స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రగతిని అధికారులు ప్రతిరోజు సమీక్షించుకోవాలని, కోవిడ్ వ్యాక్సిన్ కొరకు 90% ప్రజలు ఆదార్ ద్వారా రిజిష్టర్ చేసుకోగా మిగిలిన కొంతమంది ఇతర దృవీకరణల ఆదారంగా రిజిష్టర్ చేయించుకున్నారని, ప్రతి మున్సిపాలిటిలో 5 పోలింగ్ కేంద్రాల వారిగా ఓటరు జాబితా ఆదారంగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించి వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను ఆదార్, మొబైల్ నెంబర్ ఆదారంగా వెరిఫై చేసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్నట్లు నిర్థారించుకున్న వారి వివరాలు ఫోర్టల్ నమోదు జరగనట్లయితే రిజిష్టర్ చేయాలని, సరైన ఆదారాలను చూపించనట్లయితే వారికి వ్యాక్సిన్ ఇచ్చేలా జాబితాను రూపొందించి రేపటి సాయంత్రంలోగా నివేధికను అందజేయాలని సూచించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రారంభించిన, ప్రారంభించాల్సిన, మరియు పనులు జరిగి చెల్లింపులు జరపవలసిన వాటిపై అధికారులు దృష్టి సారించాలని, పరిపాలన అనుమతులు పొందిన పనుల ఎస్టిమేషన్ పరిశీలించాలని, ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే పనులు నిర్వహించేలా చూడాలని, పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేసేలా అధికారులు దృష్టి సారించాలని పేర్కోన్నారు. అనంతరం పట్టణప్రగతి ద్వారా పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రతి పనివారిగా అధికారులతో కలెక్టర్ సమీక్షించి లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.
హరితహారం, ఎవెన్యూ ప్లానిటేషన్ ప్రతిరోజు పరిశీలించాలని, సమస్యలను అధిగమించి పనులను సజావుగా పూర్తిచేసేలా అధికారులు చూడాలని, బృహత్ పల్లె ప్రకృతి వనం, ట్రీపార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, చిన్న పనులు సైతం ప్రగతి అలస్యంగా ఉందని, మెగా పి.పి.వి. లో ఎవరి ద్వారానైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే పోలీసు వారి సహయాన్ని తీసుకోని పనులు పూరిచేయాలని అన్నారు.
టిఎస్బిపాస్ లో ఫోస్ట్ వెరిఫికేషన్ టీం సభ్యులు, నిర్మాణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని, సిబ్బందికి, యజమానులకు నిర్మాణాలు, టిఎస్ బిపాస్ పై అవగాహన కల్పించాలని తెలిపారు. పట్టణ అభివృద్జిలో బాగంగా మున్సిపాలిటిలకు మంజూరు చేసిన కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని, ఖండెం స్థితిలో ఉన్న వాహనాల నివేధికను పంపించాలని అన్నారు.
వీధి విక్రయదారులకు ఋణాలు మంజురై పంపిణిలో సమస్యలు తలెత్తినట్లయితే వాటిని వెంటనే పరిష్కరించాలని, ఋణాలు తీసుకున్నవారు తిరిగి బ్యాంకులకు లోన్ తిరిగి చెల్లించేలా కూడా చూడాలని, నుం డిబ్యాంకు బ్రాంచ్ వారిగి వివరాలను సేకరించి ఋణాలను సకాలంలో చెల్లించిన వారికి తిరిగి మరోసారి ఋణాలను ఇచ్చేలా చూడలాని, స్త్రీనిధి, బ్యాంకు లింకేజి SHG ఋణాలను అనర్హులు ఋణాలు తీసుకున్నారా పరిశీలించాలని, భూవన్ లో ఎటువంటి పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. వీది దిపాలు వెలగడం లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రతి వీధి వారిగా సానిటేషన్ ప్రక్రియను పరిశీలించినప్పుడు, వీధీ దీపాలు సరిగా వెలుగుతున్నాయా తనిఖీ చేసి వాటిని రిపేరు చేయించడం గాని, వాటి స్థానంలో వెరేవాటిని అమర్చడం వంటివి జరిగేలా చూడాలని పేర్కోన్నారు. మీసేవా వారిగా బి ఆండ్ ఎస్ ఎల్ ఏ లో పెండింగ్ ఉండకూడదని, సర్టిఫికేట్ జారిలో అలస్యం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ-స్రామ్ ఫోర్టల్ లో వివరాల నమోదు సక్రమంగా జరిగేల చూడాలని, మున్సిపాలిటిలలో ఎంతమంది లాస్ట్ గ్రెడ్ సిబ్బంది ఉన్నారు, భర్తి చేయవలసినవి ఎన్ని ఉన్నాయి చూడాలని, కంపాసినెట్ అపాయిమెంట్ లు పెండింగ్ లేకుండా చూడాలని పేర్కొన్నారు.
ఈ సమీక్షలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, 5మున్సిపాలిటీలు కమీషనర్లు, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post