హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 22: తెలంగాణాకు హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టర్ పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని తనిఖీ చేసారు. పల్లె ప్రకృతి వనంలో 2 వేల మొక్కలు నాటినట్లు, అన్ని మొక్కల సంరక్షణ చేయాలని అన్నారు. పండ్ల మొక్కలు నాటడంపై కలెక్టర్ సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా గ్రామ హరితహారం లక్ష్యం, నర్సరీలో పెంచుతున్న మొక్కల గురించి అడిగి తెసుసుకున్నారు. దాతల సహాయంతో పల్లె ప్రకృతి వనంలో కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటుచేయాలన్నారు. అనంతరం లింగాల ఘనపూర్ మండలంలో చీటూరు గ్రామ నర్సరీని కలెక్టర్ తనిఖీ చేసారు. నర్సరీ సామర్థ్యం మేరకు మొక్కల పెంపకం చేయాలన్నారు. వాచ్ అండ్ వార్డ్ కు ఎన్ని మొక్కల సంరక్షణ చేస్తున్నది, నెలకు ఎంత మొత్తం వస్తున్నది అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నది లేనిది వాచ్ అండ్ వార్డ్ బాధ్యతలు చేస్తున్న వారిని అడిగారు. కోవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలని అన్నారు. నర్సరీ చుట్టూ ప్రహరీలా పండ్ల మొక్కలతో గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మొక్కల ట్రీ గార్డులు వంగిపోయి, పడిపోయి ఉంటున్నట్లు, వెంటనే అట్టి వాటిని సరిచేయాలన్నారు. మొక్కలకు సాసరింగ్ చేయాలని ఆయన తెలిపారు. చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే క్రొత్త మొక్కలు నాటాలన్నారు. హరితహారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని, ఏ దశలోనూ నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా పంచాయతి అధికారి రంగాచారి, పాలకుర్తి మండల పంచాయితి అధికారి దయాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు వున్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post