హరితహారంలో భాగంగా రహదారి పొడవున రెండువైపులా ఖాళీలు లేకుండా నాటే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.

పత్రిక ప్రకటన
తేది: 3-9-2021
నాగర్ కర్నూల్ జిల్లా.
హరితహారంలో భాగంగా రహదారి పొడవున రెండువైపులా ఖాళీలు లేకుండా నాటే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం యస్.జె.ఆర్. ఫంక్షన్ హాల్లొ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాల పై అదనపు కలెక్టర్ మను చౌదరితో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, హరితహారం వంటి కార్యక్రమాలు దాదాపుగా విజయవంతం చేసినట్టు తెలిపారు. ఇంకా మిగిలిపోయిన వాటికి వంద శాతం పూర్తి చేసేవిధంగా కష్ట పడాలన్నారు. హరితహారం చేపట్టి సంవత్సరాలు అవుతున్న ఇంకా రహదారి పొడవునా అక్కడక్కడ .మొక్కలు కనిపించకపోవడం సరికాదన్నారు. వచ్చే వారం రోజుల్లో మీ మీ గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని రహదారుల్లో రెండు వైపులా ఎక్కడా ఖాళీ లేకుండా మొక్కలు నాటించాలని ఆదేశించారు. సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం పూర్తి అయినందున ఇక వాటి వాడకం మొదలు పెట్టాలని, తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారుచేయించాలని ఆదేశించారు. ఏ గ్రామానికి వచ్చిన సెగ్రిగేషన్ షెడ్ తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ లో చేసిన పనికి వెంటనే రికార్డులు పూర్తి చేసి ఎఫ్.టి.ఓ లు అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రతి సమావేశానికి మధ్య పనుల పురోగతిలో తేడా కనిపించేలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదనపు కలెక్టర్ మనుచౌదరి సమీక్షిస్తూ ఉపాధి హామీ కూలీల పోస్టల్ అకౌంట్లను బ్యాంక్ అకౌంట్ లుగా మార్చాలని ఆదేశించడం జరిగిందని ఇప్పటి వరకు గ్రామం వారిగా ఉన్న మొత్తం అకౌంట్లు ఎన్ని వాటిలో ఎన్ని అకౌంట్లను బ్యాంకు ఖాతాలుగా మార్చారని మండలం వారిగా యంపీఓ లను ప్రశ్నించారు. అదేవిధంగా బృహత్ పల్లెప్రకృతి వనాల పురో భివృద్ధి పై వివరాలు సేకరించారు. అన్ని ఉపాధిహామీ పోస్టాఫీస్ అకౌంట్లను బ్యాంక్ అకౌట్లుగా మార్చాలని ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.పిఓ రాజేశ్వరి, పిడి డిఆర్డీఏ నర్సింగ్ రావు, జడ్పి సీఈఓ ఉషా, ఎంపిడివోలు, ఏపీలో లు, ఈ.సిలు తదితరులు పాల్గొన్నారు.
—————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post