హరితహారం, ఎం.జి.ఎన్.ఆర్. ఈ.జీ.ఎస్. పారిశుధ్యంపై సమీక్ష సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వన్

పత్రికా ప్రకటన-2,   తేది:04.01.2022, వనపర్తి.

ప్రభుత్వం చేపట్టిన హరితహారం, ఎం.జి.ఎన్.ఆర్. ఈ.జీ.ఎస్. పారిశుధ్యం పనులలో అలసత్వం వహించరాదని, లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వన్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎం పి వో లు, ఏపీవో లతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం లో భాగంగా అమరచింత, చిన్నంబావి, కొత్తకోట, పెబ్బేరు మండలాలలో ఏర్పాటుచేసిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి, మొలకెత్తని వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, గుంతలు త్రవ్విన చోట కొత్త మొక్కలు నాటాలని, వారం లోపు లక్ష్యానికి చేరువగా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన తెలిపారు. హరితహారం కింద చెల్లించవలసిన మొత్తాలను సత్వరమే చెల్లించాలని ఆయన సూచించారు.
ఎం.జి.ఎన్.ఆర్. ఈ.జీ.ఎస్. ద్వారా ఏర్పాటు చేసిన ఉపాధి కూలీలు 50 మంది రావాల్సి ఉండగా, పెబ్బేరులో 23 మంది మాత్రమే హాజరవుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ కి వివరించారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే సరిచేసుకోవాలని, రెండు రోజులలో సంజాయిషీ ఇవ్వాలని ఎంపీడీవో, ఏపీవో లను ఆదేశించారు. ఉపాధి కూలీలకు సంబంధించిన రిజిస్టర్లు పూర్తిచేయాలని , జాబ్ కార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చెయ్యాలని ఆయన తెలిపారు.
స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. డి ఆర్ డి ఓ, డి పి వో లు ఎంపీడీవోలు, ఎం పి వో లు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో గ్రామ సరిహద్దుల నుండి గ్రామాల వరకు పరిశుభ్రంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
మిషన్ భగీరథలో భాగంగా మంచినీటి సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఎంపీడీవో దృష్టికి తీసుకురావాలని, ఎంపీడీవోలు వెంటనే పరిష్కరిస్తారని ఆయన సూచించారు. మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ అధికారులు, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. గ్రామాలలోని వైకుంఠ  దామలకు నీటి వసతి, కరెంటు సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు, డి పి ఓ సురేష్ కుమార్, అడిషనల్ డి ఆర్ డి ఓ కృష్ణయ్య, మండల ప్రత్యేక అధికారులు, ఎం.పి.డి.వో. లు, ఎంపీవోలు, ఏ. పి.ఓ. లు, జిల్లా, మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post