హరితహారం కార్యక్రమంపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.                                                                 తేది:17.7 .2021
వనపర్తి.
హరితహారం కార్యక్రమంలో పెండింగ్ ఉన్న పనులను సత్వరమే పూర్తిచేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు ముక్కల చొప్పున పంపిణీ చేయాలని, ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న మొక్కలను పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్ట ర్ అధికారులకు సూచించారు.
వనపర్తి మున్సిపాలిటీ లో 4 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇందులో 1 నిర్మాణములో ఉందని, మిగిలిన మూడు మార్కెట్ యార్డులకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నాలుగు దహన వాటికల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్లు ఆమె తెలిపారు. 1 శ్రీనివాసపురం ఫారెస్ట్ లో, రాజనగరం, నాగవరం గ్రామాలలో కేటాయించినట్లు ఆమె తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లకు ఇరు వైపున మొక్కలు నాటాలని, విద్యుత్తు, మిషన్ భగీరథ, పారిశుద్ధ్యం పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులలో సక్రమంగా విధులు నిర్వర్తించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ( లోకల్ బాడీ) అంకిత్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మహేష్, కృష్ణ, బండారు కృష్ణ, భువనేశ్వరి, లక్ష్మీనారాయణ, బ్రహ్మం, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

…………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయబడినది.

 

 

Share This Post