హరితహారం నిర్దేశిత లక్ష్యాలను సమన్వయంతో సాధించాలి: జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ప్రజలకు స్వచ్చమైన సహజవాయువు అందించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్ధేశించిన లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సాధించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, జిల్లా ఎస్‌.పి. సురేష్‌కుమార్‌, జిల్లా అటవీ అధికారి శాంతారాంతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గత సంవత్సరం హరితహారంలో నిర్దేశించిన లక్ష్యాలను శాఖల వారిగా సాధించడం అభినందనీయమని, అదే విధంగా ఈ సంవత్సరం లక్ష్యాలను యధావిధిగా కేటాయించడం జరుగుతుందని, విభాగాల వారీగా కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికే విధంగా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని, మొక్కల సంరక్షణలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సహాయ, సహకారాలు తీసుకోవాలని, అటవీ సంరక్షణలో అన్ని శాఖల సిబ్బంది సహకరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజస్వ మండల అధికారి దత్తు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post