హరితహారం పర్యవేక్షణ బృందాలకు సహకరించాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

హరితహారం పర్యవేక్షణ బృందాలకు సహకరించాలి…

మహబూబాబాద్ ఆగస్టు 30.

2019- 20 సంవత్సరంలో చేపట్టిన హరితహారం మొక్కల ప్రగతిని వాస్తవ నివేదిక రూపొందించాలని అదేవిధంగా తనిఖీ బృందాలకు సహకరించి వాస్తవాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో హరితహారం పై ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ జరిగింది అనంతరం కలెక్టర్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హరితహారం పై తనిఖీ కార్యక్రమం సెప్టెంబర్ 15 లోపు ముగుస్తున్నందున హరితహారంలో చేపట్టిన అన్ని విధాల బ్లాక్ బండు అవెన్యూ తదితర ప్లాంటేషన్ వివరాలను ప్రాంతాలతో సహా ప్రత్యక్షంగా దానికి బృందాలకు చూపించగలగాలి అన్నారు పంచాయతీ సెక్రటరీలకు చెక్లిస్ట్ ఇవ్వబడుతుందని ఆ చెక్లిస్ట్ ఆధారంగా హరితహారం ప్రగతిని తనిఖీ అధికారులకు చూపించవలసి ఉంటుందన్నారు.

అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్య గ్యాప్ లో మొక్కల చోట నాటిన మొక్కలను కూడా లెక్కింపు చేయాలన్నారు.

అవెన్యూ ప్లాంటేషన్ కు నేరేడు చింత వేప వంటి మొక్కలు నాట వచ్చునని అన్నారు.

మంకీ ఫుడ్ కోర్టు గా విప్ప అల్లనేరేడు జూబ్లీ వంటి మొక్కలు సరఫరా చేస్తే బాగుంటుందని ఎంపీడీవోలు ఫారెస్ట్ అధికారులను కోర గా నేరేడు చింత వేప వాటి పరిధిలోకి వస్తాయని అటవీశాఖ అధికారులు తెలియజేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అటవీశాఖ అధికారి రవి కిరణ్ అటవీ అభివృద్ధి అధికారి ఇ కృష్ణమాచార్యులు డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, డి పి ఓ రఘువరన్ తదితరులు పాల్గొన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post