హరితహారం ముందస్తు ప్రణాళిక చేపట్టాలి…

ప్రచురణార్థం

హరితహారం ముందస్తు ప్రణాళిక చేపట్టాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 24.

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఆధ్వర్యంలో హరితహారం ముందస్తు ప్రణాళిక పై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరిత హారంలో నాటే మొక్కల పెంపకానికి ముందస్తు ప్రణాళిక చేపట్టాలన్నారు నర్సరీలలో అందుకు అనుగుణంగా మొక్కలు పెంచాలని మొక్కలు తగిన బ్యాగులను కూడా తెప్పించుకోవాలి అన్నారు.

రైతుల కొరకు టేకు మొక్కలు అధికంగా నర్సరీల్లో పెంచాలన్నారు అదేవిధంగా ఈత మొక్కలను కూడా పెంచవలసిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను నిర్దేశించాలని నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు పోవాలి అన్నారు.

మొక్కల పెంపకం లో ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు విత్తనాలు కూడా నాణ్యత పరమైనవిగా ఉండాలన్నారు.
అదేవిధంగా వాతావరణానికి అనుకూలంగా మొక్కలు నిర్ణీత వ్యవధిలోనే పెంచడం చేయాలన్నారు మొక్కలు తప్పనిసరిగా మూడు అడుగుల ఎత్తు ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి రవికిరణ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి డిఆర్డిఎ పిడి సన్యాసయ్య ఎక్సైజ్ అధికారి దశరథ పంచాయతీ అధికారి రఘువరన్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు
—————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post