హరితహారం మొక్కల జియో ట్యాగ్ పక్రియ వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ బి గోపి .

సోమవారం వరంగల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు.
వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు, వారి సమస్యల పట్ల సంబంధిత అధికారులతో చర్చించారు.
ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 47 దరఖాస్తులు వచ్చినవి తెలియజేయునది.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు అందరూ జియో ట్యాగింగ్ వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జియో ట్యాగింగ్ గురించి అన్ని శాఖల అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్, డి ఆర్ డి ఓ సంపత్ రావు, మరియు అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post