హరితహారం లక్ష్యం పూర్తి చేయాలి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి

వార్త ప్రచురణ,
ములుగు జిల్లా.
జనవరి,17-2022.

**హరితహారం లక్ష్యం పూర్తి
చేయాలి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి**

*ప్రజావాణి పెండింగ్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి*

వివిధ శాఖలకు కేటాయించిన హరిత హారం లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాటిఅధికారులకు ఆదేశించారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నాడు డిఫ్ఓ ప్రదీప్ కూమార్ శేట్టి,డిఆర్వో రమాదేవి తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ జిల్లాలో హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో 2022- 2023 సంవత్సరానికిగానూ 14.50 అదేవిధంగా 2023- 2024 గాను 13.4 0 లక్ష్యంగా వివిధ శాఖలకు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ఇండెంట్ తయారు చేసి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకి పంపాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆయా శాఖ అధికారులను ఆదేశించారు.
2023 సంవత్సరానికి గాను ఫారెస్ట్ అటవీశాఖ వారి టార్గెట్ 5.50, 2024 5.50 ,అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారికి 2023 గానూ 6.00, 2024 కు 4.90 , 2023 వ్యవసాయ శాఖ కు 1.00, 2024 గాను 1.00. 2023 కి పోలీస్ శాఖ వారికి 1.00 2024 1.00, హార్టికల్చర్ సెరికల్చర్ 2023 0.50, 2024 గాను 0.50. ఐటిడిఎ ఏటునాగారం వారి లక్ష్యం 2023- 0.50, 2024 -0.50, కేటాయించడం జరిగిందని అడిషనల్ కలెక్టర్ అన్నారు.
అనంతరం ప్రజావాణి ధరఖస్తులు
ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న అర్జీలను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి పెండింగ్ అర్జీలు పంచాయతీ శాఖ , డి టి డి ఓ , జిల్లా సంక్షేమ శాఖ , విద్య శాఖ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తు లు పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
విద్య శాఖలో విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్పులు సంబందించిన విషయం పై యం. ఇ. ఓ లతో పిల్లల నుండి సంబంధిత డాక్యుమెంట్స్ తయారు చేసి డి ఇ ఓ గారికి నివేదికలు అందించాలని,అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్ ద్వార స్కాలర్ షిప్ అప్లయ్ చేసుకోవచ్చు నాని యల్.డి.యం ఆంజనేయులు ఈసందర్భంగా సంబంధిత అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సకాలంలో స్కాలర్ షిప్స్ చెల్లించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగ పద్మజ జిల్లా వైద్యాధికారి ఏ అప్పయ్య ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు ఎస్సి వెల్ఫేర్ అధికారి భాగ్యలక్ష్మి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post