ప్రచురణార్థం
హరితహారం లక్ష్యాలను సాధించాలి…
మహబూబాబాద్-జూలై 22:
హరితహారం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో ముందుకు పోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఏడో విడత హరితహారం లక్ష్యాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
జిల్లాలో అటవీశాఖ సహకారంతో హరితహారం కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు .69 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు కృషి చేయాలన్నారు స్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్స్ లో విరివిగా మొక్కలు నాటాలన్నారు.
బయో ఫెన్సింగ్ చేపట్టాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ఎత్తుగా ఉండాలని అటవీశాఖ అధికారులు పర్యవేక్షించాల న్నారు.
బృహద్ పల్లె ప్రకృతి వనాలలో ఎకరానికి 31,000 మొక్కలు నాటాలి అన్నారు బండ్ ప్లాంటేషన్ బ్లాక్ ప్లాంటేషన్ కమ్యూనిటీ ప్లాంటేషన్ తప్పనిసరిగా చేపట్టాలన్నారు డి ఆర్ డి ఎ ద్వారా నాటుతున్న మొక్కలకు లేనిచోట అటవీశాఖ అధికారులు సరఫరా చేయాలని కలెక్టర్ తెలియజేశారు.
ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో అప్పారావు, డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, అటవీశాఖ అధికారి కృష్ణమాచారి డి పి ఓ రఘువరన్ తదితరులు పాల్గొన్నారు
——————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది