హరితహారం లక్ష్యాలను సాధించాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

హరితహారం లక్ష్యాలను సాధించాలి…

మహబూబాబాద్ ఆగస్టు 25 .

జిల్లాలో హరితహారం లక్ష్యాలు సాధించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా హరితహారం కమిటీ సమావేశమే ప్రగతిని జిల్లా అటవీ శాఖ అధికారి ఆధ్వర్యంలో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నీటిపారుదల శాఖ లక్ష్యాల యిన కాలువలు బండ్ ప్లాంటేషన్ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

ఎస్ ఆర్ ఎస్ పి అధికారులు కాలువల భూములు ఆక్రమణకు గురికాకుండా రైతులతో మాట్లాడాలని, టేకు మొక్కలు రైతులకు ఉపయోగకరంగా ఉంటాయని నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీ లకు అప్పగించాలన్నారు.

3 లేయర్ లుగా నాటుతున్న మొక్కలు మొదటి లేయర్ పూల మొక్కలు రెండు మూడు లేయర్ మొక్కలు నీడ నిచ్చేవిగా ఉండాలన్నారు.

అటవీ శాఖ ఆధ్వర్యంలో చెక్ డ్యామ్ ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.
రోడ్లు భవనముల శాఖ అధికారులు హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ రాజ్ రోడ్లకు మొక్కలు కొనుగోలు జేసి నాటుతున్నారన్నారు.
కలర్ ట్రీ గార్డ్ లు పెడితే ఆకర్షణీయంగా ఉంటాయన్నారు.
ఎక్సైజ్ అధికారులు ఖార్జుర మొక్కలు , ఈత, వెదురు నాటాలన్నారు.

పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున మొక్కలు నాటి హరితహారం లక్ష్యాలు సాధించాలన్నారు.

ఈ కమిటీ లో అటవీ శాఖ అధికారి రవికిరణ్, డి.ఆర్.డి.ఏ. పీడీ సన్యాసయ్య, ఆర్ అండ్ బి ఈఈ తానేశ్వర్, ఎస్సారెస్పీ ఈఈ వెంకటేశ్వరరావు, డిపిఓ రఘువరన్, ఎక్సైజ్ అధికారి దశరధ్, మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వాణి, ఫిషరీస్ అధికారి బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.
——————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post