హరితహారం లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా పటిష్ట చర్యలు :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

హరితహారం లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా పటిష్ట చర్యలు :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

*ప్రచురణార్థం-3*

*హరితహారం లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా పటిష్ట చర్యలు :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*

జయశంకర్ భూపాలపల్లి, మే 10: ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్న 8వ విడత హరితహారం కార్యక్రమ లక్ష్యాన్ని ప్రణాళికాబద్దంగా పటిష్ట కార్యాచరణతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం ప్రగతిభవనంలో అధికారులతో హరితహారం కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు 8వ హరితహారం క్రింద 26 లక్షల 37 వేల మొక్కలు నాటు లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఇట్టి లక్ష్యాన్ని వివిధ శాఖలకు కేటాయించి, ఆయా శాఖల ద్వారా లక్ష్యం పూర్తికి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖకు 13.1 లక్షలు, సింగరేణి కి 4 లక్షలు, అటవీశాఖకు 2 లక్షలు, ఐటిసి భద్రాచలంకు 3 లక్షలు, పోలీసు శాఖకు 1.5 లక్షలు, మునిసిపల్ శాఖకు 80 వేలు, విద్యాశాఖ కు 40 వేలు, ఎక్సైజ్ శాఖకు 47 వేలు, వ్యవసాయ శాఖకు 45 వేలు, ఉద్యానవన శాఖకు 15 వేలు, అన్ని వసతిగృహాలకు 50 వేలు మొక్కలు నాటే లక్ష్యంగా నిర్ధారించినట్లు ఆయన అన్నారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ చొప్పున 241 నర్సరీలు ఏర్పాటుచేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి నర్సరీల్లో 27 లక్షల మొక్కలు పెంచుతున్నట్లు ఆయన అన్నారు. 2021-22 సంవత్సరంలో బండ్ ప్లాంటేషన్ క్రింద 1.07 లక్షలు, అవెన్యూ ప్లాంటేషన్ క్రింద 0.918 లక్షలు, హోమ్ స్టెడ్ క్రింద 6.26 లక్షలు, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ క్రింద 0.12 లక్షలు, కమ్యూనిటీ ప్లాంటేషన్ క్రింద 0.54 లక్షలు, హరితవనాల క్రింద 5.56 లక్షలు, బయో ఫెన్సింగ్ క్రింద 0.91 లక్షలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో 2.68 లక్షలు, మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ క్రింద 1.27 లక్షలు, మొత్తంగా 19.328 లక్షల మొక్కలు నాటినట్లు కలెక్టర్ తెలిపారు. వసతిగృహాల్లో మొక్కలు నాటుటకు ఖాళీస్థలంపై నివేదిక సమర్పించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖలకు చెందిన భవనాల వద్ద మొక్కలు నాటుటకు అవకాశం ఉన్న స్థలంపై నివేదిక ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి, రైతులను సంప్రదించి, వారు ఏ ఏ రకాలు, ఎంతమేర మొక్కలు అడుగుతుంది నివేదిక ఇవ్వాలన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి, ఈత తదితర మొక్కలు స్థానికంగా లభ్యం కానియెడల, ఆలస్యం చేయకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి సేకరించుటకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ శాఖకు చెందిన భవనాలు, శిక్షణా కేంద్రాల వద్ద ఖాళీ స్థల లభ్యతపై వివరాలు ఇవ్వాలన్నారు. రేగొండ నుండి కాళేశ్వరం, జిల్లా నుండి ఇతర జిల్లాలకు కనెక్టివిటీ రోడ్ల కిరువైపుల అవకాశాన్ని బట్టి రెండు, మూడు వరసలు మొక్కలు నాటుటకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద మిగులు ఖాళీ స్థలాలు, చెరువు బండ్లపై అనువైన మొక్కలు నాటుటకు కార్యాచరణ చేయాలన్నారు. 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ క్రింద ఖర్చు చేయుటకు అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రతి మొక్క నాటే ప్రదేశాన్ని గుర్తించి, టిజిఎఫ్ఎంఐఎస్ పోర్టల్ లో నమోదుచేయాలని, జియో ట్యాగింగ్ చేయాలని చేయాలని ఆయన తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. నాటిన పెట్టి మొక్క సంరక్షిపబడేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మక కార్యక్రమమని ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా వ్యక్తిగత శ్రద్ధతో విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా అటవీ అధికారి బి. లావణ్య, డిఆర్డీవో పురుషోత్తం, జెడ్పి సిఇఓ శోభారాణి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి. శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి బి. శ్రీనివాస రెడ్డి, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి టి. శైలజ, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారిణి డి. సునీత, జిల్లా వ్యవసాయ అధికారి ఎం. విజయభాస్కర్, ఆర్ అండ్ బి ఇఇ ఎన్. వెంకటేష్, జిల్లా ఇర్రిగేషన్ అధికారి వై. మోహన్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post