హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

 

పత్రిక ప్రకటన

తేదీ : 12–11–2022

జిల్లాను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్ళేలా అధికారులు కృషి చేయాలి,

జిల్లా వ్యాప్తంగా వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలి,

హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి,

ప్రభుత్వ నిబంధలకు విరుద్దంగా నిర్మించే భవనాలపై చర్యలు చేపట్టాలి,

సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించి నిర్మించతలపెట్టిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అలాగే హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ విషయంలో అధికారులు పూర్తి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యతో కలిసి వెజ్, నాన్వెజ్, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గుర్తించిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు ఇంకా ఎక్కడైనా స్థలాలు సేకరించనట్లయితే వెంటనే స్థలాలను ఎంపిక చేసిన పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.  గ్రామాల్లో, పట్టణాల్లో  హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాల విషయంలో  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని  జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వాటి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించామని ఇప్పటి వరకు ఎన్ని రకాల మొక్కలు నాటారు అందులో ఎన్ని బాగా ఉన్నాయని అడిగారు. ప్రభుత్వ సూచనల మేరకు హరితహారంలో మొక్కలు ఎండిపోయినట్లతే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు తెలిపారు.. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అధికారులపై చర్యలు తప్పవని తెలిపారు. అలాగే జిల్లాలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు కూడా పూర్తికాలేదని వాటిని వెంటనే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దంగా చేయాల్సిందిగా సంబంధిత మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా అక్రమ కట్టడాలు, అనుమతిలేని లే అవుట్స్తో పాటు  ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన నిర్మిస్తున్న భవనాల విషయంలో అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి నిబంధనలకు విరుద్దంగా ఉంటే వాటిని కూల్చివేయాలని ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు, ఒత్తిడులు వచ్చినట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రకాల పథకాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఈ విషయాల్లో తత్సారం ఏమాత్రం పనికిరాదని కలెక్టర్ హరీశ్ అధికారులకు వివరించారు. అధికారులు చేపట్టే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సమస్యలు ఉన్నట్లయితే నేరుగా తన దృష్టికి తీసుకురావానలి కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, జడ్పీ సీఈవో దేవసహాయం,  జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, మండలాల ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post