*హరిత హరం లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*హరిత హరం లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

——————————-
సిరిసిల్ల 20, జూలై 2022
——————————-
హరిత హరం క్రింద సిరిసిల్ల , వేములవాడ మున్సిపాలిటీ లకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ కమిషనర్ లు, అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హల్ లో జిల్లా కలెక్టర్ సిరిసిల్ల , వేములవాడ మున్సిపాలిటీలలో అభివృద్ధి పనుల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

హరిత హరం లక్ష్యాలను వేగంగా పూర్తి చేసేందుకు పక్కా షెడ్యూల్ ను సిద్ధం చేయాలన్నారు. షెడ్యూల్ ప్రతిని తనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు అందజేయాలని అన్నారు.
స్ట్రెచ్ ల వారీగా లక్ష్యం, టార్గెట్ , బాధ్యులను పెట్టీ ఫిట్టింగ్, ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. ఎవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్, ట్రీ పార్క్ ప్లాంటేషన్ పై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో నదుల బఫర్ జోన్ లో, చెరువుల FTL లలో నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చి వేయాలన్నారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు జరగకుండా నిఘా పెట్టాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

TS B PASS లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు.

మున్సిపాలిటీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రై డే ను కట్టు దిట్టంగా అమలు చేయాలన్నారు. శుక్రవారం, మంగళ వారం తో పాటు బుధవారం కూడ డ్రై డేను ఉదయం 08.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.0o గంటల వరకు చేపట్టాలన్నారు. ప్రతి వార్డులో స్థానిక కౌన్సిలర్ ల సహకారం, భాగస్వామ్యంతో కనీసం 60 ఇండ్లలో కీ వెళ్లి డ్రై డే చేపట్టాలని..ప్రజలకు కార్యక్రమ ప్రాధాన్యతను వివరించాలని అన్నారు.

కొవిడ్ సమయంలోనే నిర్వహించిన మాదిరే జ్వర పీడితుల ను గుర్తించేందుకు సర్వే చేపట్టాలని అన్నారు. ఎక్కడైనా ప్రజలు ఎక్కువగా జ్వరాల బారిన పడినట్లు గుర్తిస్తే ప్రతి రోజూ ఆ కాలనీ లో డ్రై డే చేపట్టాలని అన్నారు. ఫైరి త్రిమిన్ ద్రావణం ను పిచికారీ చేయాలన్నారు.

అన్ని త్రాగునీటి టాంక్ లను క్లీన్ చేయాలన్నారు. మోతాదుకు మించకుండా క్లోరిన్ కలపాలన్నారు. త్రాగునీటి సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ప్రజారోగ్య ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు.
సురక్షిత త్రాగునీటి సరఫరా జరిగేందుకు వీలుగా నీటినీ పరీక్షించే శాంపిల్ ల సంఖ్యను పెంచాలని అన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రమాదకర ఓపెన్ బావులను, బోరు బావులను పూడ్చి వేయాలన్నారు.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో
శాంతి నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో పెండింగ్ పనులను వచ్చే వారంలో, రగుడు, పెద్దురు డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో పెండింగ్ పనులను రెండు వారాల్లో పూర్తి చేయాలన్నారు.
డెడ్ లైన్ విధించునీ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
అర్బన్ ఫారెస్ట్ పార్క్, STP, బస్తీ దవాఖాన పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. వేములవాడ లో సమీకృత మార్కెట్, డంప్ యార్డ్ పనులు త్వరితతిన పూర్తి చేయాలన్నారు.

సమావేశంలో జిల్లా అతను కలెక్టర్లు బి సత్యప్రసాద్ , ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, శ్యాంసుందర్రావు ప్రజారోగ్య విభాగం ఇంజనీర్లు ,టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ రహదారులు భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో పురోగతిలో ఉన్న రోడ్డు నిర్మాణ ఇతర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

Share This Post