హరిత హారం లక్ష్యం మేరకు ప్లాంటేషన్ చేసి జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

హరిత హారం లక్ష్యం మేరకు ప్లాంటేషన్ చేసి జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, ఆగస్ట్ -04:

హరిత హారం లక్ష్యం మేరకు ప్లాంటేషన్ చేసి జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి హరిత హారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 69.58 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 34.903 లక్షలు పూర్తి చేయగా, ఇంకను 34.679 లక్షలు చేయవలసి ఉన్నదని తెలిపారు. డి.ఆర్.డి. ఓ., ఫారెస్ట్, ఉద్యానవనం, మునిసిపల్ వారు కొంత మేర ప్లాంటేషన్ చేయడం జరిగిందని, మిగతా శాఖలు చేయలేదని, లక్ష్యం మేరకు నాటాలని, నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాలని, బండ్ ప్లాంటేషన్ చేయాలని, టార్గెట్ ఏర్పాటు చేసుకొని పనులు చేపట్టాలని, ఈత మొక్కలు ప్లంటబుల్ సైజ్ మొక్కలు నాటాలని, ఎన్.ఆర్.జి.ఎస్. లో పనులు చేసి మొక్కలను కాపాడాలని తెలిపారు.

ఎన్ని సంఘాలకు ఎంత మేర భూమి ఉన్నది, ప్లాంటేషన్ చేయుటకు ఎంత మేరకు అవకాశం ఉన్నది చూసి అందుకు తగ్గట్లుగా ప్లాంటేషన్ చేయాలని, ప్లాంటేషన్ ఎక్కడెక్కడ జరిగిందో వివరాలు సమర్పించాలని ఎక్సైజ్ శాఖ అధికారిని ఆదేశించారు.

హరిత హారం పై ఎక్కువగా దృష్టి పెట్టాలని, కెనాల్, ట్యాంక్ బండ్ వద్ద మొక్కలు నాటేందుకు హద్దులు తెలిపి కో ఆర్డినేషన్ చేస్తూ ఎన్.ఆర్.జి.ఎస్., పంచాయతీ రాజ్ ద్వారా మొక్కలు నాటే విధంగా చూడాలని, మొక్కలు నర్సరీ ల నుండి సేకరించాలని, ఇవ్వని సందర్భంలో తనకు తెలపాలని, లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని ఇరిగేషన్ ఈ.ఈ. వెంకటేశ్వర్లు ను ఆదేశించారు.

జిల్లాలో ఉన్న 900 పాఠశాలల్లో ఎంత మేరకు మొక్కలు నాటేందుకు ఎంత మేరకు భూమి ఉన్నది, మొక్కలు నాటేందుకు అవకాశం ఉన్నది వివరాలు నమోదు చేసి నివేదిక సమర్పించి, కాంపౌండ్ వాల్ ఉన్న స్కూల్ లు, కాంపౌండ్ వాల్ లేని చోట్ల బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి స్కూల్స్ వారీగా వారం కు ఒకసారి సమీక్షించుకుని కేటాయించిన 50 వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వివిధ శాఖలకు సంబంధించిన ఏ. ఈ.లు ఎం.పి.డి. ఓ లతో సమన్వయం చేసుకొని రోడ్ల ప్రక్కన ఇరువైపులా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని తెలిపారు.

బృహత్ పల్లె ప్రకృతి వనాలు, మల్టీ లేయర్ ప్లాంటేషన్, బండ్ ప్లాంటేషన్, పాఠశాలల్లో కొన్ని చోట్ల మోడల్ గా బెస్ట్ గా రూపొందించి మిగతా వారికి ఆదర్శంగా ఉండే విధంగా చూపెట్టాలని తెలిపారు.

ప్రతి వారం హరిత హారం పై సమీక్షించడం జరుగుతుందని, లక్ష్యం మేరకు ప్రగతి కనపడాలని తెలిపారు.

ఈ సమావేశంలో డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, ఆర్ అండ్ బి ఈ.ఈ. తానేశ్వర్, డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, ఐ.బి. ఈ. ఈ. వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post