హింసను ఎదుర్కొన్న బాధిత బాలలకు ,మహిళలకు వెంటనే పరిహారం అందేలా కృషి చేయాలన్న వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం. హరిత

పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించే చట్టం (పొక్సో) చట్టం 2012 క్రింద నమోదు కాబడి, వరకట్నం కారణంగా మరణించిన మహిళల బాధిత కుటుంబాలకు, కిడ్నాప్ గురైన తదితర మూడు కేటగిరీలకు చెందిన బాధిత కుటుంబాలకు మహిళ శిశు సంక్షేమ శాఖ 28 జి.ఓ. ప్రకారం ఆర్థిక పరిహారం చెల్లింపు విషయమై జిల్లా స్థాయి మహిళలు, పిల్లలు అట్రాసిటీ కమిటీ సమావేశం నిర్వహించారు.

వరంగల్ రూరల్ జిల్లా లోని హింసను ఎదుర్కొన్న బాధిత బాలలకు మరియు మహిళలకు అందించాల్సిన పరిహారాన్ని వెంటనే అందించాలని, వారికి కావలసిన సహాయాన్ని ప్రభుత్వం తరపున సమకూర్చాలని, బాధిత బాలలు, మహిళల వారి వివరాలు సేకరించి పోలీస్ శాఖ మరియు వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్, వివిధ సంక్షేమ శాఖ ల ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల సంరక్షణ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో బాధితులకు త్వరగా పరిహారం అందించేలా కృషి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం. హరిత తెలిపారు.

శనివారం రోజున మహిళలు పిల్లలు జిల్లా అట్రాసిటీ కమిటీ ప్రత్యేక సమావేశం కలెక్టర్ చాంబర్లో కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. హరిత మాట్లాడుతూ జిల్లాలోని ఇప్పటివరకూ ఎంతమంది బాధిత మహిళలకు బాలలకు పరిహారం అందించారని, వాటి వివరాలు మరియు క్షేత్రస్థాయిలో మరియు వరకట్న కారణాలతో మరణించిన బాధిత కుటుంబాలకు, అత్యాచారం, కిడ్నాప్ గురైన బాధితులకు ఎంతమందికి పరిహారం అందించడం జరిగిందని మరియు అందించిన పరిహారాన్ని జి.ఓ. ఎం.ఎస్ నెంబర్ 28 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే 25% ,చార్జిషీట్ అయిన వెంటనే 25% మరియు కేసు ముగింపు దశలో మిగతా 50 శాతం అందించిన వారి వివరాలు తదితర విషయాలను కూలంకుషంగా చర్చించడం జరిగింది.

ఈ పరిహారం అందించటంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తుందని మరియు పెండింగ్ లో ఉన్నటువంటి పరిహారం వెంటనే బాధితులకు అందజేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.జిల్లా ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఎంత మంది బాధిత కుటుంబాలకు మరియు మహిళలకు అందించారు అనే విషయాలను చర్చించడం జరిగింది.

అంతేకాకుండా జిల్లాలోని ఇక నుండి ప్రతి నెల వారీగా ప్రత్యేకంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి పరిహారం అందేటట్టు చూడాలని పోలీసు శాఖ సహకారంతో వాటి వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నటువంటి వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ జిల్లా అధికారులకు మహిళలు బాలలకు ఏదైనా హింసకు గురైనట్లయితే వెంటనే అధికారులకు తెలిసేవిధంగా సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.

వరంగల్ ఈస్ట్ జోన్ డి.సి.పి వెంకటలక్ష్మి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో ఎఫ్.ఐ.ఆర్ నమోదు అయిన వెంటనే మెడికల్ రిపోర్ట్ లకు సంబంధించి నివేదికలు హైదరాబాద్ ఫోరెన్సిక్ కార్యాలయం నుండి రావాల్సిన మెడికల్ రిపోర్టులు,వాటి వివరాలను త్వరలోనే తెప్పించి బాధిత మహిళలకు, బాలలకు పరిహారం అందించేందుకు పోలీసు శాఖ తరపున కృషి చేస్తామని అంతేకాకుండా బాధితులకు మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పరిహారం అందించే విధంగా చూస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సంపత్ రావు, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ బీసీ సంక్షేమ అధికారి నరసింహస్వామి, జిల్లా సంక్షేమ అధికారి ఎం.శారద, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ శాఖ అధికారులు జిల్లా బాలల పరిరక్షణ అధికారి జి.మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సమాచార అధికారి, వరంగల్ రూరల్ వారిచే జారీ చేయనైనది.

Share This Post