హుజరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణపై సెక్టోరల్ ఆఫీసర్ ల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పత్రికా ప్రకటన తేదీ: 13-10-2021
కరీంనగర్

సెక్టోరల్ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

సెక్టోరల్ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఎన్నికల పరిశీలకులు
00000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో సెక్టోరల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉప ఎన్నికల సాధారణ పరిశీలకులు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, వ్యయ పరిశీలకులు ఎస్ హెచ్. ఎల మురుగు. జి లతో కలసి సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉప ఎన్నికలకు సంబంధించి 30 మంది సెక్టోరల్ అధికారులను నియమించామని, 8 మంది సెక్టోరల్ అధికారులను రిజర్వులో ఉంచామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలను మరొకసారి తనిఖీ చేసుకొని సౌకర్యాలను కల్పించాలని సెక్టోరల్ అధికారులను ఆదేశించారు. ఒకే వరండాలో వరుస క్రమంలో ఉండే పోలింగ్ కేంద్రాలలో కొన్నింటిని పక్క గదుల్లోకి మార్చాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. వరుసగా ఉండే పోలింగ్ కేంద్రాల వల్ల రద్దీ పెరుగుతుందని, దీన్ని నివారించేందుకు పక్క గదుల్లోకి పోలింగ్ కేంద్రాలను మార్చాలని అన్నారు. పోలింగ్ లొకేషన్లో ఓటర్లను, కాలనీవాసుల ను ఓటు వేయకుండా భయబ్రాంతులకు గురిచేసే రాజకీయ శక్తులు, అభ్యర్థుల ప్రాబల్యాన్ని నియంత్రించేందుకు గాను ఆ ప్రాంతాలను సందర్శించి అక్కడి వారితో, గ్రామ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడాలని, సమస్యాత్మక ప్రాంతాల నివేదిక ను వెంటనే అందజేయాలని కలెక్టర్ సెక్టోరల్ అధికారులను ఆదేశించారు. ఈవీఎం యంత్రాల కమిషనింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ రోజు రోజు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ కు గంట ముందే మాక్ పోలింగ్ నిర్వహించాలని, అనంతరము వివి ప్యాట్ ల లో స్లిప్పులు లేకుండా చూసి ప్రిసైడింగ్ అధికారుల చేత సీల్ చేయించాలని అన్నారు.

ఎన్నికల సాధారణ పరిశీలకులు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ మాట్లాడుతూ ఉప ఎన్నికలు ముగిసే అంతవరకు సెక్టోరియల్ అధికారులకు మెజిస్ట్రేట్ పవర్ ఉంటుందని తెలిపారు. ఓటర్లపై ప్రభావం చూపించేలా నగదు, బహుమతులు పంపిణీ చేసే రాజకీయ నాయకులు, అభ్యర్థులపై నిఘా పెట్టి పట్టుకోవాలని తెలిపారు. అనంతరము ఈవీఎం యంత్రాల కమీషనింగ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎస్ఎచ్. ఎలామురుగు. జి, సాధారణ పరిశీలకులు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, సెక్టో రల్ అధికారులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post