హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 1,45,20,727 నగదు సీజ్ : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

పత్రికా ప్రకటన

తేదీ :13- 10 -2021

కరీంనగర్

హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 1,45,20,727 నగదు సీజ్.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ .వి కర్ణన్.
o0o

హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు ,వివిధ విజిలెన్స్ టీంల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 1,45,20,727 నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయుటకు, అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టుటకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని ,అలాగే స్టాటిక్ సర్వే లెన్స్ టీములు , ఫ్లయింగ్ ఫ్లయింగ్ టీములను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించగా భారీ ఎత్తున నగదు, మద్యం పట్టుబడ్డ పట్టుబడినట్లు ఆయన తెలిపారు. ఇంతవరకు 1,45,20,727 రూపాయల నగదును, 1,50,000 రూపాయల విలువ గల 30 గ్రాముల బంగారం ,9,10,000 రూపాయల విలువ గల 14 కిలోల వెండిని ,5,11,652 రూపాయల విలువ గల 867 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే 2,21,000 రూపాయల విలువ గల 66 చీరలు, 50 షర్టులను ,స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే 19,750 రూపాయల విలువ గల 3.51 కిలోల గంజాయిని పట్టుకొని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్ ద్వారా జారీ చేయబడినది

Share This Post