హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని పోలింగ్ కేంద్రాలను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్.

పత్రిక ప్రకటన తేది:10-10-2021

కరీంనగర్

శాంతియుత వాతావరణంలో స్వేచ్చగా హుజురాబాద్ ఉప ఎన్నికలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్

పోలింగ్ కేంద్రాలను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన సి.ఈ.వో.

పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ వి. సత్య నారాయణ
-000-

31 –హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలు శాంతియుత వాతావరణంలో స్వేచ్చగా జరిగెందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ పోలింగ్ కేంద్రాలను ఆయన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ పాఠశాలలోని 163, 164, 170, 171 నెంబర్ గల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు అన్ని ఒకే దారిలో ఉన్నందున ఓటర్ల రద్దీని క్రమ పధ్దతిలో నియంత్రించాలని అధికారులకు సూచించారు. కోవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించేలా చూడాలని, మాస్కులు ధరించాలని, చేతులు సానిటైజ్ చేసుకోవాలని, భౌతికదూరం పాటిస్తూ ఓటింగ్ లో పాల్గొనేలా చూడాలని అన్నారు. అనంతరం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించారు. సెంటర్ లోని స్ట్రాంగ్ రూములను, ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. ఉప ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించెందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధికారులు చేశారని అన్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని, ఉప సంహరణ ప్రక్రియ ముగియగానే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని తెలిపారు. పోలింగ్ కు 72 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని అన్నారు. ఇన్ డోర్ లో 200 మందికి మించకుండా, బహిరంగ ప్రదేశాలలో 1,000 మందికి మించకుండా సభలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో 5 గురు మాత్రమే పాల్గొనాలని తెలిపారు. ఈ నెల 30 న పోలింగ్ ముగిసెంత వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికారులు ఖచ్చితంగా అమలు చేస్తారని అన్నారు. సమావేశాలకు, బహిరంగ సభలకు హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. అందరూ తప్పని సరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకొవాలని, ఇందుకోసం నియోజకవర్గంలో విరివిగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి., వి.ఎస్.టి., వి.వి.టి. బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. కట్ ఆఫ్ తేదీ వరకు ఓటర్లుగా నమోదు అయ్యెందుకు ధరఖాస్తు చేసుకున్న వారందరికి ఓటు వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని ఈ కేంద్రాల పరిధిలో ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు ప్రలోబాలకు గురికాకుండా ఉండెందుకు కట్టుదిట్టమైన చర్యలను అధికారులు తీసుకుంటున్నారని తెలిపారు. హింసాత్మాక సంఘటనలు జరగకుండాఉండెందుకు కేంద్ర పోలీస్ బలగాలు, పారా మిలిటరీ బలగాలను కూడా వినియోగిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు పెట్టే ఖర్చుల పై సాధారణ ఎన్నికల పరిశీలకులు, పోలీస్ పరిశీలకులు, ఎక్స్ పెండిచర్ పరిశీలకుల నిఘా ఉంటుందని అన్నారు. ఎన్నికలు స్వేచ్చగా శాంతియుత వాతావరణంలో జరిగెందుకు రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థులు అందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ వి. సత్య నారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సి.హెచ్. రవీందర్ రెడ్డి, నోడల్ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

 

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది

Share This Post