హుజురాబాద్ ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ముత్తు కృష్ణన్ సూచించారు.

గురువారం నాడు నిట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ముత్తు కృష్ణన్, శంకర్ నారాయణ, పోలీస్ అబ్జర్వర్ అనుపమ్ అగర్వాల్ తో కలసి హుజురాబాద్ ఉప ఎన్నికల ఏర్పాట్లు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికలలో ఎక్కడా ఎటువంటి అవాంతరాలు ఎదురు కాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే ఎక్కడా వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలన్నారు.సున్నిత పోలింగ్‌ కేంద్రాలు, గ్రామాల్లో అధికారులు నిరంతరం పర్యటించాలని సూచించారు.బ్యాంకు ఖాతాల పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనుమతి లేని ప్రచార హోర్డింగ్‌లను తొలగించాలన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై సమాచారం వస్తే వెంటనే స్పందించి వెళ్లాలని ఆదేశించారు. సెక్టోరల్‌ ఆఫీసర్లు త మ పరిధిలోని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ర్యాంపులు, లైటింగ్‌, వాష్‌ రూంలు, విద్యుత్‌ సౌకర్యం ఉన్నవి లేనివి తనిఖీ చేయాలని ఆదేశించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.

కమీషనర్ ఆఫ్ పోలిస్ తరుణ్ జోషిమాట్లాడుతూ హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయుటకు, అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టుటకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, అలాగే స్టాటిక్ సర్వే లెన్స్ టీములు, ఫ్లయింగ్ టీములను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు.

కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నమని అన్నారు. దాదాపు ఓటర్లందరికి ఫస్ట్ డోస్ టీకా ఇవ్వడం జరిగిందని వివరించారు. పోలీస్ రెవిన్యూ ఎక్సైస్ అధికారులను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల మార్గ దర్శకాలను విధిగా పాటిస్తున్నామని అన్నారు.

ఈ సమావేశంలో డిసిపి పుష్ప,ఆర్డివో వాసుచంద్ర,డిఎంహెఓ లలితాదేవి ఎక్సైస్ అధికారి సురేష్ ఎల్డియం సత్యజిత్ ,భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post