హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్ల ను SRR కళాశాలలో పరిశీలన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

 

హుజురాబాద్ ఉప ఎన్నిక… కౌంటింగ్ కేంద్రం పరిశీలన

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0000

అక్టోబర్ 30 న జరుగనున్న హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ పరిశీలించారు.

గురువారం స్థానిక ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ, పీజి కళాశాలను అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, డిసిపి శ్రీనివాస్ లతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఎన్నిక ముగిసాక ఈ.వి.ఎం.లు, వీవీప్యాట్ లను భద్రపరచడంతో పాటు నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు నిర్వహించుటకు కళాశాలలోని ఆడిటోరియం హాల్, ఇండోర్ స్టేడియం, గ్రంధాలయ భవనం, తరగతి గదులని కలెక్టర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఏసిపి తులా శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు ల్యాండ్ సర్వే అశోక్,తహశీల్దార్ సుధాకర్, కలెక్టరేట్ ఏ.ఓ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post