హుజురాబాద్ ఉప ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించి పరిశీలిస్తున్న రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి జ్యోతి బుద్ధ ప్రకాష్ పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి

0000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి జ్యోతి బుద్ధప్రకాష్ బుధవారం ఉప ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఈ నెల 30న జరగనున్న పోలింగ్ సందర్భంగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. ఈనెల 21వ తేదీన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేపట్టనున్న ఈవీఎంల కమిషనింగ్ గురించి జిల్లా ఎన్నికల అధికారి ని అడిగి తెలుసుకున్నారు. అనంతరము ఉప ఎన్నికల సరళి, నిర్వహణ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వీ కర్ణాన్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు ముత్తు కృష్ణన్ శంకరనారాయణ, అనుపమ్ అగర్వాల్ తో చర్చించారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి, ఆర్ డి ఓ సిహెచ్. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post