హుజురాబాద్ ఉప ఎన్నికల పై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

 

శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఉప ఎన్నిక నిర్వహించాలి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు చేయాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్
00000

ఈనెల 30న జరగనున్న హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికను శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. బుధవారం సాయంత్రం కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ లు, హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి తో ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో హెల్త్ డెస్కులు ఉండేలా చూడాలని అన్నారు. అన్ని సౌకర్యాలు ఉండాలని, వీల్ చైర్ లు, విద్యుత్ ఉండేలా చూడాలని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహించాలని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ పోలింగ్కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం సమాప్తం అయిందని, పొలిటికల్ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పి వో లు ఏపీవొ లు, వో పీ వో లు ఈనెల 29న హుజురాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రి తో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. పోలింగ్ రోజు ఉదయము మొదటగా మాక్ పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో క్లియర్ చేసి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారని తెలిపారు. కో విదు నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్ని కను శాంతియుతంగా స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఉప ఎన్నికకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 20 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామని అన్నారు. వోటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నివారించేందుకు విజిలెన్స్ టీంలు పని చేస్తున్నాయని తెలిపారు.

ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ రవీందర్ రెడ్డి, సి ఆర్ పి ఎఫ్ సెకండ్ ఇన్ కమాండెంట్ ఎస్ హెచ్. మనీ జి నాయర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post