హుజురాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయములో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్.

హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

000

31 – హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికకు సంబంధించి హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో (ఆర్.డి.వో. కార్యాలయం) నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

గురువారం సాయంత్రం హుజురాబాద్ ఆర్.డి.వో. కార్యాలయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తో కలిసి సందర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా నామినేషన్లు స్వీకరించెందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారికి సూచించారు. హుజురాబాద్ నియోజక వర్గంలోని హుజురాబాద్ ఆర్.డి.వో. కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటిల్లో వ్యాక్సినేషన్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కోవిడ్ రెండు డోసులు వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలు అందరూ విధిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సానిటైజేషన్ తో చేతులు శుభ్రపరుచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సి.హెచ్. రవీందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జువేరియా, తహశీల్దార్ రాం రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post