హుజురాబాద్ జడ్పి ఉన్నత పాఠశాలలో పి వో లు, ఏపీవో లకు నిర్వహించిన శిక్షణ తరగతులను పరిశీలించిన సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, పక్కన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పకడ్బందీగా హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహన

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తాము

ఉప ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ

జిల్లా ఎన్నికల అధికారి తో కలిసి  డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పి ఓలు, ఏపీ ఓల శిక్షణ తరగతుల పరిశీలన

000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంతోపాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తామని హుజురాబాద్ ఉప ఎన్నికల కేంద్ర సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణ శంకర్ నారాయణ అన్నారు.  హుజురాబాద్ ఉప ఎన్నికల  సందర్భంగా శుక్రవారం  హుజురాబాద్    జడ్పి ఉన్నత పాఠశాలలో పిఓ లకు ఏపీవో లకు నిర్వహించిన శిక్షణ తరగతులను ఆయన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి పరిశీలించారు.  అనంతరం హుజురాబాద్  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి ఆయన సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఈవిఎంల కమీషనింగ్  ప్రక్రియను ఆయన పరిశీలించారు.  డిస్ట్రిబ్యూషన్ సెంటర్, జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో లో ఏర్పాటుచేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ మాట్లాడుతూ   ఎన్నికల ప్రవర్తనా నియమావళిని హుజురాబాద్ నియోజకవర్గం పరిధి లోనే కాకుండా కరీంనగర్ , హనుమకొండ   జిల్లాల వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు.  ఉప ఎన్నికల సరళి,  నిర్వాహణ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ తో చర్చించారు.

Share This Post