హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో పర్యటించి దళిత బంధు రీ సర్వే చేస్తున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్.

అర్హులైన దళిత కుటుంబాలందరికీ దళిత బంధు అందిస్తాం

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో రీ సర్వే ను పరిశీలించిన కలెక్టర్
000000

అర్హులైన దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

శుక్రవారం హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో పర్యటించి దళిత బంధు రీ సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. దళిత బంధు పథకం డబ్బులతో వారు స్థాపించే యూనిట్ ల గురించి దళిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. హుజూరాబాద్ మండలం రాజపూర్, జమ్మికుంట మండలం వావిలాల సమీపం నగురం గ్రామం లో సర్వే బృందాల పని తీరు పరిశీలించారు. బ్యాంకర్లు అర్వులైన దళిత కుటుంబాలకు తెలంగాణ దలితబందు పేరిట కొత్తగా బ్యాంక్ ఖాతాలు తేరువాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి దళిత పథకం డబ్బులు అందుతాయని, ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. లాభసాటి యూనిట్లను స్థాపించుకుని ఆర్థికంగా ఎదగాలని వారికి సూచించారు. స్థలాలు వుంటే పాడి పరిశ్రమ పెట్టుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నా దళిత బంధు పథకాన్ని దళితులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లు ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

.

 

Share This Post