హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ లలో దళిత బందు హెల్ప్ డెస్క్ లను ప్రారంభించి, పరిశీలిస్తున్న ఎస్. సి. కార్పొరేషన్ ఈడీ సురేష్

హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో దళితబందు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్.
o0o

హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాలలో దళిత బంధు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ తెలిపారు.
బుధవారం హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాలలో ప్రారంభించిన దళిత బంధు హెల్ప్ డెస్క్ లను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. ఇదివరకే హుజరాబాద్ నియోజకవర్గం అన్ని గ్రామాల లోని అర్హులైన దళిత కుటుంబాలకు వారి అకౌంట్ లలో దళిత బంధు డబ్బులు జమ చేయడం జరిగిందని తెలిపారు .దళిత బంధు పథకం అమలు పై ఏలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా వెంటనే బ్యాంకులలో,హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత బందు సహాయ కేంద్రాలలో( హెల్ప్ డెస్క్ ) సంప్రదించాలని ఆయన సూచించారు . అలాగే దళిత బంధు పథకం లబ్ధిదారులు తమ అకౌంట్లలో డబ్బుల జమ అయిన వివరాలు తెలుసుకొనుటకు వీలుగా హుజురాబాద్, జమ్మికుంట, మండలాల లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లలో దళిత బందు హెల్ప్ డెస్క్ లను ఇదివరకే ప్రారంభించి లబ్ధిదారుల అపోహాలు, అనుమానాలను నివృత్తి చేస్తున్నారని తెలిపారు. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో రాజేందర్ ఫోన్ నెంబర్ 9032806250 ను, హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సంపత్ రావు ఫోన్ నెంబర్ 9989334509 లను హెల్ప్ డెస్క్ ఇన్చార్జి లు గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

Share This Post